పాకిస్తాన్ నుంచి సింధ్ ప్రాంతాన్ని విభజించాలని చేసిన ప్రతిపాదన ఇప్పుడు అంతర్గతంగా చిచ్చు రేపుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ వేలాది మంది కరాచీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపడుతున్నారు. అదే సమయంలో సింధు ప్రాంతాన్ని వేరు చేసి ప్రత్యేక సింధు దేశంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. ప్రస్తుతం పాకిస్తాన్ లో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి. వాటిని 12 నుంచి 15కు పెంచాలని సీడీఎస్ ఆసిమ్ మునీర్ మద్దతు ఉన్న కేంద్ర మంత్రులు ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చారు. వీటిని ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత బిలావల్ భుట్టో వ్యతిరేకించారు. దీంతో ఈ ప్రతిపాదనపై ఆగ్రహంగా ఉన్న సింధ్ రాష్ట్ర ప్రజలు, సింధ్ జాతీయ వాదులు ఆయుధాలతో రోడ్లపైకి వచ్చారు. సింధ్ విభజనకు ప్రయత్నిస్తే.. ఆర్ధికంగా శక్తివంతమైన పంజాబ్ పై ఆర్దిక దిగ్బంధం విధిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు తమకు ప్రత్యేక సింధు దేశం కావాలని డిమాండ్ చేస్తున్నారు. కరాచీతో పాటు సింధ్ లో ఈ నిరసనలు తీవ్రమయ్యాయి. మరోవైపు పాకిస్తాన్ లో రాష్ట్రాల విభజన పై చేపట్టే ప్రజాభిప్రాయ సేకరణపై చర్చలు ఈ ఏడాది చివరి నాటికి స్పష్టత ఇస్తాయని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ఏర్పాటుకు ముందే ప్రత్యేక నాగరికత, భాష, సంస్కృతి ఉన్న తమ సింధ్ రాష్ట్రాన్ని విభజించ వద్దని కోరుతున్నాయి. విభజించాలనుకుంటే మాత్రం సింధు దేశ్ పేరుతో ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. గతంలో 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ వేర్పాటు తర్వాత ఈ సింధుదేశ్ డిమాండ్ తొలిసారి వినిపించింది. ఇప్పుడు మరోసారి ఆ డిమాండ్ తెరపైకి వచ్చింది. దీనికి మద్దతుగా నాలుగు సింధీ జాతీయవాద పార్టీల కూటమి జై సింధ్ రహబర్ కమిటీ ఆధ్వర్యంలో వేలాది ఉద్యమకారులు ఎర్రజెండాలతో రోడ్లపైకి వస్తున్నారు. దీంతో అక్కడి ప్రభుత్వం తలపట్టుకుంటోంది. అలాగని ఈ నిరసనల్ని అణగదొక్కే పరిస్ధితి లేదు. దీంతో అటు ఆసిమ్ మునీర్, ఇటు నిరసనకారుల మధ్య ప్రభుత్వం నలిగిపోతోంది.
3
Beranda
› Demands for a Separate 'Sindhu Desh'
› Intense Protests
› international
› Pakistan consists of four provinces
› proposal to increase the number of provinces to between 12 and 15
› ప్రత్యేక సింధు దేశం కోసం డిమాండ్స్ : తీవ్రమైన నిరసనలు
Subscribe to:
Post Comments (Atom)
