భారత్-శ్రీలంక తొలి వన్డే : ఢిల్లీ నుంచి విశాఖకు వేదిక మార్పు
వి.బి-జీ రామ్ జీ అమలు : తెలంగాణ ప్రభుత్వ కృషిని ప్రశంసిస్తూ మంత్రి సీతక్కకు లేఖ రాసిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
తనను కాదని వేరే వ్యక్తితో పెళ్లికి సిద్ధపడటాన్ని తట్టుకోలేకపోయిన ప్రియురాలి హత్య చేసిన ప్రియుడు
దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలను విద్యకు దూరం చేయడానికి పక్కా వ్యూహం : కేంద్రంపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆరోపణలు
గ్లోబల్ సమ్మిట్‌పై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష : జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశం
గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో వెబ్‌ల్యాబ్స్ అభివృద్ధి చేసిన స్పోర్ట్-ఈ డిజిటల్ ప్లాట్ ఫామ్ ప్రారంభం
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన క్రిస్టియానో రొనాల్డో
తిరుపతి లడ్డూ కేసు : ఆంధ్రప్రదేశ్ వెలుపలకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఛార్జీలు పెంపు : బీఎంటీసీ సిటీ బస్సుల్లో 35 శాతం, కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో సగటున 23 శాతం పెంపు
మెర్సిడెస్ బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ SUV విడుదల : విడుదలైన 36 గంటల్లో 550 మందికి పైగా కారు కోసం నమోదు చేసుకున్న వినియోగదారులు
జనవరిలో ఐఫోన్ 18 విడుదల? : 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.3-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
పంట నష్టంపై వివరాలు సేకరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం : తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పొంగులేటి
ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను డీకొట్టిన ఆర్‌టిసి బస్సు : తృటిలో తప్పిన పెను ప్రమాదం
పీఓకేలో పాకిస్తాన్ భద్రతా దళాలు జరిపిన డ్రోన్ దాడులు, తుపాకీ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి : 18 మందికి తీవ్ర గాయాలు
సముద్రపు అలల ధాటికి కొట్టుకొచ్చిన పడవలో నాలుగు మృతదేహాలు లభ్యం!
మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓటమి : ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లకు భారీ ఊరట : 2008 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ : రూ.8 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
అమెజాన్ గ్రేట్ ఫెస్టివల్ సేల్ : ఐక్యూ జడ్ 11 లైట్ 5జీపై డిస్కౌంట్ ఆఫర్
దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్న ఇటాల్‌జెట్
ఇటలీకి చెందిన ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ ఇటాల్‌జెట్ భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటలీలోని మిలాన్ నగరంలో జరుగుతున్న EICMA 2026 అంతర్జాతీయ మోటార్‌సైకిల్ ప్రదర్శనలో తన కొత్త డ్రాగ్‌స్టర్ స్కూటర్ లైనప్‌ను ఆవిష్కరించింది. ఈ ప్రదర్శనలో ఇటాల్‌జెట్ మూడు కొత్త మోడళ్ల పరిచయం తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో తనదైన గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్రాండ్ ఇప్పుడు భారతీయ వినియోగదారులకు కూడా స్కూటర్లను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కోల్హాపూర్‌కు చెందిన మోటోహౌస్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కొత్త భాగస్వామ్యం ద్వారా భారతీయ మార్కెట్లో తన వ్యాపారాన్ని విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. డిజైన్,పెర్ఫార్మన్స్ లో ప్రత్యేక గుర్తింపు పొందాయి . ఇటాల్‌జెట్ స్కూటర్ లో 278cc సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 8,250rpm @ 23.8hp పవర్,టార్క్ 6,250rpm@ 26Nmగా ఉంటుంది . ఇందులో CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, బెల్ట్ డ్రైవ్ సిస్టం ఉంటాయి. డిజైన్ విషయానికి వస్తే Dragster 300 ప్రత్యేకమైన ఎక్స్‌పోజ్డ్ ట్యూబులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌తో స్పోర్టీ లుక్ కలిగి ఉంటుంది. సాధారణ స్కూటర్లకు భిన్నంగా ఫ్రేమ్, మెకానికల్ పార్ట్స్ బయటకు కనిపించేలా దీన్ని రూపొందించారు. ముందు భాగంలో Independent Steering System టెక్నాలజీని ఉపయోగించారు. ఇందులో సింగిల్ ఆర్మ్, హైడ్రోన్యూమాటిక్ షాక్ అబ్జార్బర్, అడ్జస్టబుల్ స్ప్రింగ్ ఉంటాయి. వెనుకవైపు లింక్ టైప్ మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. బ్రేకింగ్ కోసం ముందు 240mm డిస్క్, వెనుక 175mm డిస్క్ బ్రేక్‌లతో పాటు Brembo బ్రేకింగ్ , డ్యూయల్ ఛానల్ ABS అందించారు. ముందు 120/70 R12, వెనుక 140/60 R13 టైర్లు ఉంటాయి. సేఫ్టీతో పాటు రైడింగ్ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సిస్టం ను రూపొందించారు. ఇతర ఫీచర్లలో కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, ఫుల్ LED లైటింగ్, 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 770mm సీట్ హైట్ ఉన్నాయి. ఇటాల్‌జెట్ స్కూటర్ మోడల్ లో 449cc ప్యారలల్ ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది DOHC టెక్నాలజీతో రూపొందించారు . ఈ ఇంజన్ 9,500rpm @ 47.58hp పవర్, 8,000rpm@41Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు SmartShift టెక్నాలజీ అందించారు. ఈ ప్రత్యేకమైన సిస్టం ద్వారా ఆటోమేటిక్ గేర్ ఆపరేషన్‌తో పాటు హ్యాండిల్‌బార్‌పై ఉండే ప్యాడిల్ షిఫ్టర్ల సహాయంతో మాన్యువల్ తరహాలో గేర్లు మార్చుకోవచ్చు. దీంతో రైడర్లు తమ అవసరానికి అనుగుణంగా రైడింగ్ విధానాన్ని ఎంచుకోవచ్చు. డిజైన్ పరంగా Dragster 459 ఎక్స్‌పోజ్డ్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, అగ్రెసివ్ బాడీ స్టైలింగ్, స్పోర్టీ రైడింగ్ పొజిషన్‌తో ఆకట్టుకుంటుంది. ముందు భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ Marzocchi USD ఫోర్క్, వెనుకవైపు Marzocchi మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. ఇందులో 15 ఇంచుల వీల్స్‌తో పాటు Pirelli టైర్లు ఉపయోగించారు. ముందు 120 సెక్షన్, వెనుక 160 సెక్షన్ టైర్లు ఉంటాయి. బ్రేకింగ్ లో ముందు రెండు 270mm డిస్క్ బ్రేకులు, వెనుక 260mm డిస్క్ బ్రేక్ అందించారు. Brembo బ్రేకింగ్ వ్యవస్థతో పాటు డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇవి జారుడు రోడ్లపై, ఆకస్మిక బ్రేకింగ్ సమయంలో స్కూటర్‌పై నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇతర ఫీచర్లలో కలర్ TFT డిస్‌ప్లే, LED లైటింగ్, 16 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 815mm సీట్ హైట్ ఉన్నాయి. మూడు మోడళ్లలో అత్యంత శక్తివంతమైన స్కూటర్. ఇందులో 698cc ప్యారలల్ ట్విన్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది DOHC టెక్నాలజీతో రూపొందించారు . Autocar India నివేదిక ప్రకారం ఈ ఇంజన్ 70hp పవర్, 70Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే Italjet అధికారిక అంతర్జాతీయ టెక్నికల్ షీట్ ప్రకారం 8,000rpm @ 68hp పవర్, 5,500rpm @ 67Nm టార్క్ అందిస్తుంది . ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, వెట్ మల్టీ ప్లేట్ క్లచ్, చైన్ డ్రైవ్ సిస్టం ఉంటాయి. ఇది సాధారణ ఆటోమేటిక్ స్కూటర్లకు భిన్నంగా మోటార్‌సైకిల్ తరహా రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. డిజైన్ విషయానికి వస్తే Dragster 700 ఎక్స్‌పోజ్డ్ ట్యూబులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్, అగ్రెసివ్ స్పోర్టీ బాడీవర్క్‌తో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముందు భాగంలో పూర్తిగా అడ్జస్టబుల్ Marzocchi USD ఫోర్క్, వెనుకవైపు Marzocchi అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అందించారు. వెనుక సస్పెన్షన్‌లో ISAS సిస్టం ను ఉపయోగించారు. ఇందులో ముందు, వెనుక 15 ఇంచుల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. Pirelli 120/70 R15 ఫ్రంట్, 160/60 R15 రియర్ టైర్లు అందించారు. బ్రేకింగ్ కోసం ముందు 270mm డ్యూయల్ డిస్క్ బ్రేకులు, వెనుక 260mm సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. Brembo కాలిపర్లు, డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సేఫ్టీ ఫీచర్లుగా ఉన్నాయి. ఇతర ఫీచర్లలో కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, LED లైటింగ్, 16 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 815mm సీట్ హైట్ ఉన్నాయి. అంతర్జాతీయ వెర్షన్ గరిష్ట వేగం గంటకు 190 కిలోమీటర్లుగా పేర్కొన్నారు.







































