యాపిల్ ఐఫోన్ సిరీస్‌లో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇందులో కేవలం ప్రో మోడల్స్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చింది. కానీ యాపిల్ త్వరలోనే ఐఫోన్ 18 మోడల్‌ను కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ వచ్చే ఏడాది మొదటి నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వీబోలో తెలిపిన వివరాల ప్రకారం ఐఫోన్ 18 మోడల్‌లో 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.3-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలిపారు. ఇందులో యాపిల్ సొంత నెక్స్ట్-జెన్ A20 చిప్‌సెట్ వినియోగించినట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. లుక్స్ పరంగా కంపెనీ తన ట్రేడ్‌మార్క్ డైనమిక్ ఐలాండ్ డిజైన్‌తో దీనిని వినియోగదారులకు పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తోంది.. మార్కెట్‌లోకి ఐఫోన్ 18 మోడల్‌తో పాటు తక్కువ బడ్జెట్ వినియోగదారుల కోసం ఐఫోన్ 18eతో పాటు ఐఫోన్ ఎయిర్ 2 మోడల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం భారత్‌లో ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900తో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.. అయితే, మెమరీ కాంపోనెంట్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో మార్కెట్లో ధరలు కూడా విపరీతంగా పెరిగినట్లు తెలుస్తోంది.. తాజా సమాచారం ప్రకారం.. ఐఫోన్ 18 ధర మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని టెక్ నిపుణులు తెలుపుతున్నారు.. యాపిల్ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అద్భుతంగా పని చేసేందుకు ఐఫోన్ 18, ఐఫోన్ 18e మోడల్స్‌లో మెమరీని భారీగా అప్‌గ్రేడ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.. వీటిలో ఏకంగా 9GB ర్యామ్‌ను కూడా తీసుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఐఫోన్ 18e మోడల్ మాత్రం బడ్జెట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.12-అంగుళాల LTPS OLED డిస్ల్పేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కూడా A20 ప్రాసెసర్‌తో పాటు 9GB ర్యామ్‌తో లాంచ్ చేయబోతున్నట్లు లీక్ అయిన వివరాలు స్పష్టం చేశాయి.. అంతేకాకుండా 48-మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో 24-మెగాపిక్సెల్ కెమెరాను తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది..
3
Beranda
› business
› Feature a 6.3-inch OLED Display with 1.5K Resolution and 120Hz Refresh Rate
› iPhone 18 Launching in January?
› technology
› జనవరిలో ఐఫోన్ 18 విడుదల? : 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేసే 6.3-అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
Subscribe to:
Post Comments (Atom)
