ఆంధ్రప్రదేశ్ లోని ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ విజయకేతనo ఎగురవేసింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 52 మంది కౌన్సిలర్లు 51 మంది టిడిపి 1 బిజెపి తరఫున ఏకగ్రీవాలయ్యారు.. టీడీపీ చైర్‌పర్సన్‌గా ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సోదరుడు నంద్యాల రాఘవ రెడ్డి ఏకగ్రీవంగా విజయం సాధించారు. ప్రస్తుతం అందరి దృష్టి వైస్ చైర్మన్ పదవిపైనే నిలిచింది. ఇటీవల చేనేతలకు పెద్దపీఠ వేస్తామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ ఎన్నికల్లో ఏకంగా 14 మంది చేనేత వర్గానికి చెందిన వారు కౌన్సిలర్లుగా గెలుపొందడం విశేషం. మొదటి నుంచి టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న చేనేత వర్గానికి తగిన గుర్తింపునిచ్చేలా వైస్ చైర్మన్ పదవి వారికే కేటాయించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆశావహులైన నేతలు ఇప్పటికే ఎమ్మెల్యేను కలిసి తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వైస్ చైర్మన్ పదవికి ప్రత్యేకత సంతరించుకుంది..
3
Beranda
› 14 Individuals from the Weaving Community Elected as Councilors in Proddatur
› Andhra Pradesh
› Who Will Secure the Post of Municipal Vice-Chairman?
› ప్రొద్దుటూరులో 14 మంది చేనేత వర్గానికి చెందిన వారు కౌన్సిలర్లుగా ఎన్నిక : మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి దక్కేది ఎవ్వరికో ?
Subscribe to:
Post Comments (Atom)
