ఆన్‌ లైన్ లో తాళాలు ఎలా పగలగొట్టాలో నేర్చుకుని చోరీలకు పాల్పడుతున్న మహిళ అరెస్టు : లక్షలు విలువ చేసే బంగారం, వెండి, నగదుతో పాటు ఐఫోన్‌ 17ను స్వాధీనం చేసుకున్న పోలీసులు

హైదరాబాద్ లో తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఉప్పల్ పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి రూ. లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి, నగదుతో పాటు చోరీ చేసిన నగదుతో కొనుగోలు చేసిన ఒక ఐఫోన్‌ 17ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పాగా జయగా పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకూ నిందితురాలు ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. అలాగే పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విలాసవంతమైన జీవితానిక అలవాటు పడిన నిందితురాలు జయ భర్తకు తెలియకుండా ఆన్‌ లైన్ వేదికగా తాళాలు ఎలా పగలగొట్టాలో నేర్చుకుంది. ఇక దొంగతనం చేసే సమయంలో తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు నల్లటి బుర్ఖా, గ్లౌజులు ధరించేది. అంతేకాక ఆన్ లైన్ లో నేర్చుకున్న విధానం బట్టి పోలీసులకు ఆధారాలు దొరకుండా ఉండేందుకు చేతులకు గ్లౌజ్‌ లు కూడా వేసుకునేదని విచారణలో వెల్లడైంది. అయితే కొద్దిరోజుల క్రితం ఉప్పల్ పరిధిలోని ఓ ఇంటిలో చోరీకి పాల్పడుతూ సీసీ కెమెరాకు చిక్కింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించారు. నిందితురాలిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి భారీగా బంగారు ఆభరణాలు, కిలొన్నర వెండి, కొంత నగదుతో పాటు ఐఫోన్ 17ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక పట్టుబడిన వస్తువుల మొత్తం విలువ రూ. 70 లక్షలకు పైనే ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

Previous Post Next Post
3