ఆసియా కప్-2024 ఫైనల్‌లోకి భారత్ మహిళల జట్టు !
మ హిళల ఆసియా కప్ 2024లో భారత జట్టు ఫైనల్‌కు దూసుకువెళ్లింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ టోర్నీలో అడుగుపెట్టిన భారత్ దుంబుల్లా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. భారత బ్యాటర్లలో స్మృతి మంధాన (55 నాటౌట్; 39 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్) హాఫ్ సెంచరీ బాదగా.. షెఫాలీ వర్మ (26 నాటౌట్; 28 బంతుల్లో 2 ఫోర్లు) రాణించింది. స్వల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మలు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లపై ఎదురుదాటికి దిగారు. ముఖ్యంగా స్మృతి మంధాన తనదైన శైలిలో ఆఫ్‌సైడ్ చూడ చక్కని షాట్లతో అలరించింది. మరోవైపు షఫాలీ సైతం ధాటిగానే ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరి ధాటికి పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 46 పరుగులు చేసింది. అనంతరం మంధాన మరింత జోరు పెంచింది. కేవలం 38 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 80 పరుగులు మాత్ర...