ఆటోడ్రైవర్ల మృతి కేసు : ఇద్దరు డాక్టర్లు అరెస్ట్
హై దరాబాద్ లోని చాంద్రాయణగుట్టలో చోటుచేసుకున్న మత్తు ఇంజెక్షన్ల వ్యవహారం నగరంలో సంచలనంగా మారింది. మత్తు కోసం అనస్తీషియా ఇంజెక్షన్లు తీసుకున్న ఇద్దరు ఆటోడ్రైవర్లు మృతి చెందిన ఘటనలో పోలీసులు కీలక విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ కేసులో ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేయగా, వైద్య వృత్తికే మచ్చ తెచ్చే విధంగా కీలక విషయాలు కలకలం రేపుతున్నాయి. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లు కొంతకాలంగా మత్తు కోసం ఇంజెక్షన్లకు అలవాటు పడ్డారు. సాధారణ మత్తు పదార్థాలకన్నా ఎక్కువ ప్రభావం కోసం వారు అనస్తీషియా ఇంజెక్షన్లను తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. అధిక డోస్ కారణంగా వారి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి చివరకు ఇద్దరూ ఆటోలోనే మృతి చెందారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించగా, ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయన్న దానిపై కీలక ఆధారాలు లభించాయి. రోగులకు చికిత్స కోసం ఉపయోగించాల్సిన మత్తు ఇంజెక్షన్లను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ జైపాల్‌రెడ్డి బహిరంగ మార్కెట్లో అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆయన వద్ద నుంచి ఈ ప్రమాదకరమైన ఇంజెక్షన్లు బయటకు వెళ్లినట్టు పో...