Posts

Showing posts with the label Chatting with a young woman on Instagram

ఇన్‌స్టాగ్రామ్‌లో యువతితో చాటింగ్ : వద్దన్నా వినకపోవడంతో దారుణ హత్య

Image
క ర్ణాటకలోని మంజునాథ్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతితో చాటింగ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వద్దన్నా వినకుండా మెసేజ్‌లు చేయటంతో దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చిక్కమంగళూరు జిల్లా, తారికెరె తాలూకా, ఉదెవా గ్రామానికి చెందిన మంజునాథ్ అనే 21 ఏళ్ల యువకుడు తనకు ఇన్‌స్టాలో పరిచయం ఉన్న అమ్మాయికి తరచుగా మెసేజ్‌లు చేస్తూ ఉండేవాడు. ఆ అమ్మాయికి నిశ్చితార్థం అవ్వటంతో 'నాకు నిశ్చితార్థం అయింది. ఇకపై మెసేజ్‌లు చేయొద్దు' అని గట్టిగా చెప్పింది. అయితే మంజునాథ్ ఆ యువతి మాటల్ని పట్టించుకోకుండా పదే పదే మెసేజ్‌లు చేస్తూ ఉన్నాడు. దీంతో విసుగు చెందిన యువతి తనకు కాబోయే భర్త వేణుకు విషయం చెప్పింది. అది విని వేణు ఆగ్రహానికి గురయ్యాడు. మంజునాథ్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితులు కిరణ్, అప్పు, మంజులను తన ప్లాన్‌లో భాగం చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం మంజునాథ్‌కు ఫోన్ చేసి మాట్లాడటానికి వేణును పిలిచాడు. అక్కడ వేణు, కిరణ్, అప్పు, మంజులు కలిసి మంజునాథ్‌ను విచక్షణా రహితంగా కత్తితో పొడిచి అక్కడినుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్...