ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తరువాత బీజేపీ అధిష్ఠానం టార్గెట్ తెలంగాణ !
తె లంగాణ లోని భద్రాచలంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తరువాత బీజేపీ అధిష్ఠానం టార్గెట్ తెలంగాణ అని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి బీజేపీ కార్యకర్త పై అక్రమ కేసులు పెట్టి వేధించారని మండిపడ్డారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి ఢిల్లీకి మూటలు పంపుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇచ్చే ఇళ్లు, సన్న బియ్యాన్ని కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటోందని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ మెడలు వంచించి బీజేపీ పార్టీ అని అన్నారు. రజాకార్ల పాలన కంటే ఘోరమైన కేసీఆర్ పాలనలో బీజేపీ కార్యకర్తలు కొట్లాడారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ నాలుగు రాష్ట్రాలకే పరిమితమైందని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని.. కార్యకర్తలు పోలీసు కేసులకు భయపడొద్దని అన్నారు. 'నాపై 109 కేసులున్నా వెనుకడుగు వేసేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యా...