Posts

Showing posts with the label Clash between tribal groups in Assam

అసోంలో ఆదివాసి తెగల మధ్య ఘర్షణ : ఇంటర్నెట్ నిలిపివేత

Image
అ సోంలోని కోక్రాఝార్ జిల్లాలో బోడో, ఆదివాసి తెగల మధ్య ఘర్షణ హింసకు దారితీసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ప్రాంతంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) సిబ్బందిని మోహరించింది. హింస ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కోక్రాఝార్ తోపాటు చిరాంగ్ జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసింది. తదుపరి ఆదేశాలిచ్చేవరకు ఈ సేవలు అందుబాటులో ఉండబోవని ప్రభుత్వం పేర్కొంది. పోలీసుల కథనం ప్రకారం కరిగాం ఔట్ పోస్ట్ పరిధిలో సోమవారం రాత్రి బోడో తెగకు చెందిన ముగ్గురు వ్యక్తులు వెళ్తున్న వాహనం ఇద్దరు ఆదివాసీలను ఢీకొంది. దీంతో అక్కడి ఆదివాసీ తెగవారు ఆగ్రహంతో నిందితులపై దాడి చేశారు. వాహనాన్ని తగలబెట్టారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించాడు. దీంతో బోడో తెగకు చెందిన వారు కూడా ఆగ్రహంతో ప్రతి దాడి చేశారు. ఇది ఇరువర్గాల ఘర్షణగా మారి పరస్పరం దాడులు చేసుకున్నారు. రహదారుల్ని దిగ్భందించారు. టైర్లు తగలబెట్టారు. కొన్ని ఇండ్లు, ప్రభుత్వ ఆఫీసుల్ని కూడా దహనం చేశారు. కరిగాం ఔట్ పోస్టుపై కూడా దాడి చేసి, ధ్వంసం చేశారు. సోమవారం రాత్రి నుంచి ఇదే పరిస్థితి ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఘర్షణల్ని నివారించేందుకు ప్రభుత్వం ఆర్ఏ...