Posts

Showing posts with the label Due to the impact of Cyclone Montha

విద్యాసంస్థలకు 31 వరకు సెలవులు పొడిగింపు

Image
ఆం ధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు మరోసారి సెలవులు పొడిగించారు. ప్రభుత్వం ప్రకటన ప్రకారం అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి. మొంథా తుఫాన్‌ ప్రభావంతో గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని తీర జిల్లాలు సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. తుఫాన్‌ ప్రభావం తగ్గిన తరువాత వాతావరణ పరిస్థితులను సమీక్షించి, తరగతుల పునఃప్రారంభంపై నిర్ణయం తీసుకుంటారు.