Posts

Showing posts with the label arjunudu

గోసేవకు వరం

Image
  ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు. ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు కూడ. ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. సమాజ సేవ చేసుకుంటూ ఒక పూరి గుడిసెలో ఆ భక్తురాలు ఉండేది...!  ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామ వాసులకు దానం ఇచ్చి కాస్తో కూస్తో పుణ్యం సంపాదించేది. ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది. ఆ పుణ్య ప్రభావం తోనె ,  తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది. కన్నయతో పాటు  ధర్మశ్రేష్ఠుడైన దనుర్థారి అయిన పార్థుడు కూడా తన వెంట రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది.  ఆ రోజుల్లో అతిథి దేవునితో సమానం అంటారు. అలాంటిది ఏకంగా దేవాధి దేవుడే అతిథిగా వచ్చాడు. కనుక అమె సంతోషం అధికమైన ఆమె తన ఆవు ఇచ్చిన పాలు ఇతరులకు ఇవ్వగా వచ్చిన ఆహార పదార్థాలను అన్నిటినీ ఆరోజు కృష్ణార్జునులకు నివేదించింది. శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడిన తరువాత ఆ ...