Posts

Showing posts with the label and Snapdragon processor

త్వరలో వివో వై 500ఐ విడుదల

Image
వివో ఇప్పటికే వై 500 ప్రో ద్వారా భారీ బ్యాటరీ ఫోన్ ఇచ్చిన ఇప్పుడు అదే సిరీస్ లో వివో వై 500ఐ ను తీసుకురావడానికి సిద్ధమైంది. అధికారిక లాంచ్ కి ముందే చైనా టెలికాం డేటాబేస్ లో ఈ ఫోన్ వివరాలు కనిపించడంతో స్పెసిఫికేషన్స్ అన్నీ దాదాపుగా బయటకు వచ్చాయి. ముఖ్యంగా 7200mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ లాంటి అంశాలు ఈ ఫోన్‌ను డైలీ యూజ్ కోసం బలమైన ఎంపికగా చూపిస్తున్నాయి. వివో వై 500ఐ డిజైన్ మొదట చూసిన వెంటనే ఒక ప్రీమియం ఫీల్ ఇస్తుంది. ఈ ఫోన్ డిజైన్ చాలా వరకు వివో ఎస్50 ను గుర్తు చేస్తుంది. బ్యాక్ ప్యానల్ మీద క్లిన్ ఫినిష్ ఉండటం వల్ల ఫింగర్ ప్రింట్స్ ఎక్కువగా పడే అవకాశం తక్కువగా ఉంటుంది. కెమెరా మాడ్యూల్ ఎక్కువగా బయటకు రావకుండా ఫ్లాట్ డిజైన్ లో ఉండటం వల్ల ఫోన్ టేబుల్ మీద పెట్టినప్పుడు స్టేబుల్ గా ఉంటుంది. ఈ ఫోన్ సైజ్ 166.64mm పొడవు, 78.43mm వెడల్పు, 8.39mm మందంతో ఉంది. బరువు 219గ్రాములు కావడంతో పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా రోజువారీ వాడకంలో ఎక్కువగా ఇబ్బంది అనిపించదు. సైడ్ లో ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్పందన కూడా ఫాస్ట్ గా ఉంటుందని అంచనా. వివో వై 500ఐ లో 6.75అంగుళాల పెద్ద డిస్‌ప్లే ...