March 2026

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరువనంతపురంలో జరిగిన ఎన్డీయే కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, పార్టీ రాష్ట్ర చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు.  సంక్షేమం, హెల్త్‌కేర్, ప్రజలకు ఆర్థిక భద్రత వంటి కీలక హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. పేద కుటుంబాలకు చెందిన ఇంటి పెద్ద, వితంతువులు, 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు నెలకు రూ.3,000 చొప్పున వెల్ఫేర్ పెన్షన్. ప్రతి ఇంటికి నెలకు 20,000 లీటర్ల ఉచిత తాగునీరు. పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణ. ఓనం, క్రిస్మస్ పండుగల్లో పేద కుటుంబాలకు ఉచితంగా ఒక ఎల్‌పీజీ సిలెండర్. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద యూనివర్సల్ హెల్త్‌కేర్ కవరేజ్. రైతుల ఆర్థిక భద్రతకు భరోసాగా అన్ని అత్యవసర వ్యవసాయ పంటలకు మద్దతు ధరకు హామీ. పేద కుటుంబాల మహిళలకు నిత్యావసరాలు, మందులు కొనుక్కునేందుకు ప్రతినెలా రూ.2,500 విలువచేసే 'ఫుడ్ హెల్త్ సెక్యూరిటీ కార్డ్'. శబరిమల, గురవాయూర్ ఆలయం వంటి ప్రధాన ఆలయాల పరిరక్షణ, నిర్వహణకు దేవస్వోమ్ బోర్డుల్లో సంస్కరణలు. కేరళలో ప్రపంచ స్థాయి హెల్త్‌కేర్ సౌకర్యాలతో కూడిన ఎయిమ్స్ ఏర్పాటు. తిరువనంతపురం-కానూర్‌ను కలిపే హైస్పీడ్ రైల్వే నెట్‌వర్క్.

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి రాందేవ్‌రావు ఆస్పత్రిలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఆస్పత్రి మహిళా వాష్‌రూమ్‌ ఫ్లష్‌ ట్యాంకులో శిశువు డెడ్‌ బాడీ లభించడం హృదయ విదారకంగా మారింది. ఓ మహిళ ప్రసవం అనంతరం శిశువును ఫ్లష్‌ ట్యాంక్‌లో పడేసింది. ఆపై అక్కడ నుంచి పరారైంది. ప్రస్తుతం ఆ మహిళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. యావత్‌ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ ఘటనతో అంతా షాక్‌కు గురౌతున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 14వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. విద్యారథులు, పరిశోధకులు ఈ అత్యాధునిక సాంకేతికతను టెస్టింగ్ కోసం వినియోగించుకోవచ్చని క్యూబిక్ ఫోర్స్ సంస్థ డైరెక్టర్ వెంకట్ సుబ్రమణ్యన్, ఎస్ఆర్ఎం వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సతీష్ కుమార్ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కీలక ప్రకటన వెలువడింది. అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం హార్డ్ వేర్ తయారీ ఎకో సిస్టమ్ ఏర్పాటుపై ఈ భేటీ జరిగింది. కాగా, ఈ సమావేశానికి మొత్తంగా 30కి పైగా క్వాంటం కంప్యూటింగ్, క్రయోజనిక్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులు హాజరుకావడం విశేషం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 15 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిలో 7 సంస్థలు విజయవాడలోని మేధా టవర్స్‌‍లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఈ పరిణామాలతో అమరావతి దేశ క్వాంటం టెక్నాలజీకి కేంద్రంగా మారే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రానున్న ఐదురోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ద్రోణి, గాలి అనిశ్చితితో పాటు ఉపరితల చక్రవాకం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని ఆ ప్రకటనలో తెలిపింది. మంగళ, బుధ వారాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నది. ఈ సందర్భంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు వెల్లడించారు.

అమెరికా సైనిక విమానాలు తమ వైమానిక స్థావరాల్లో దిగడానికి ఇటలీ అనుమతి నిరాకరించింది. అమెరికాకు తమ గగనతలాన్ని మూసివేయాలని ఇటలీ చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే స్పెయిన్ అమెరికాకు షాకిచ్చింది. యుద్ధంలో పాలుపంచుకునే విమానాలను తమ గగనతలంలోకి అనుమతించబోమని ప్రకటించింది. ఇప్పుడు ఇటలీ కూడా అదే బాటలో నడుస్తోంది. సిసిలీలోని సిగోనెల్లా వైమానిక స్థావరాన్ని అమెరికా యుద్ధ విమానాలు ఉపయోగించుకోవడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ఇటలీ ప్రకటించింది. పశ్చిమాసియాకు వెళ్లే ముందు సిసిలీలోని వైమానిక స్థావరంలో తమ బాంబర్ విమానాలను నిలుపడానికి అమెరికా ఇటలీ అనుమతి కోరినట్లు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటలీ అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వ 'నియద్ నెల్లానార్' పథకం, పోలీసుల 'లోన్ వర్రాటు'  ప్రచారంతో ప్రభావితమై, వివిధ మావోయిస్టు దళాలకు చెందిన మొత్తం 25 మంది కీలక సభ్యులు ఈ రోజు గంగులూరు  పోలీసుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో గంగులూరు ఏరియా కమిటీ, కిష్టారం ఏరియా కమిటీ, భైరమ్‌గఢ్ ఏరియా కమిటీలకు చెందిన ముఖ్యమైన సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ కార్యదర్శులు, ఒకరు సంయుక్త కార్యదర్శి, నలుగురు ట్రెజరర్లు, ఆరుగురు కార్యవర్గ సభ్యులు, 12 మంది సాధారణ సభ్యులు ఉన్నారు. అందులో కొందరిపై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులు ప్రకటించింది. పీఎల్‌జీఏ కీలక సభ్యుడు మోతిరామ్ ఒయామ్, కేఏఎంఎస్ అధ్యక్షురాలు సుక్మతి ఒయామ్, మిలీషియా కమాండర్ మడ్వి భీమా లొంగిపోయిన వారి జాబితాలో ఉన్నారు. మావోయిస్టు అగ్ర నాయకత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక పద్ధతులు, స్థానిక గిరిజనులపై జరుగుతున్న వేధింపులు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులై తాము జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నట్లు లొంగిపోయిన మావోయిస్టులు వెల్లడించారు. వీరి లొంగుబాటును జిల్లా ఎస్పీ, సీఆర్పీఎఫ్ అధికారులు ధృవీకరించారు. సరెండర్ అయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తక్షణ సహాయంగా రూ.25,000 నగదు, పునరావాస ప్యాకేజీని అందజేశారు. తుపాకీ పట్టిన యువత హింసను వీడి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సదువియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు పిలుపునిచ్చారు. ఈ లొంగుబాటుతో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టుల పట్టు మరింత బలహీనపడిందని భద్రతా బలగాలు భావిస్తున్నాయి.

దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు రేపటి నుండి భారీగా పెరగనున్నాయి. సిమెంట్ కంపెనీలు బస్తాపై సుమారు రూ. 30 నుండి రూ. 50 వరకు పెంచుతున్నట్లు డీలర్లకు ఇప్పటికే సమాచారం అందించాయి. ఈ పెంపుతో మార్కెట్లో 50 కేజీల బస్తా ధర రూ. 360 వరకు చేరే అవకాశం కనిపిస్తోంది. రవాణా ఖర్చులు మరియు ముడి సరుకుల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వినియోగదారులు పాత ధరలకే స్టాక్ కొనుగోలు చేసేందుకు నేడు ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం ప్రభావం ఇప్పుడు సిమెంట్ రంగంపై కూడా పడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో రవాణా వ్యవస్థ ఖరీదుగా మారింది. దీనివల్ల ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ధరల పెంపు ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మరో వారం రోజుల్లో ఈ కొత్త ధరలు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తాయనిమార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిర్మాణ రంగంపై ఈ పెంపు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెంపు నేపథ్యంలో సిమెంట్ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 31వ తేదీన కొత్త బుకింగ్‌లను నిలిపివేసి, పాత ధరలపై ఉన్న ఆర్డర్లను మాత్రమే క్లియర్ చేశాయి. రేపటి నుండి అంటే ఏప్రిల్ 1 నుండి కొత్త ధరలతోనే బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. రిటైల్ డీలర్లు ఇప్పటికే కంపెనీల నుండి వచ్చిన సంకేతాలను బట్టి స్టాక్ సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇల్లు కట్టుకునే సామాన్యులకు ఈ అదనపు భారం తప్పనిసరిగా మారనుంది.

ఆంధ్రప్రదేశ్  కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అణగారిన వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, న్యాయం కంటే కోర్టు తొందరపాటే ఇందులో కనిపిస్తోందని ఆమె విమర్శించారు. రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆర్టికల్ 14, 15, 25లను పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కులం అనేది పుట్టుకతో వచ్చే సామాజిక వివక్ష అని, మతం మారినంత మాత్రాన దళితుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మారిపోవని ఆమె స్పష్టం చేశారు. ఎస్టీలు, బీసీలు మతం మారినా వారి హోదా కొనసాగుతున్నప్పుడు, కేవలం ఎస్సీల విషయంలోనే వివక్ష చూపడం అన్యాయమని మండిపడ్డారు. 1950 నాటి ఆర్డర్‌లోని నిబంధనలను సాకుగా చూపి దళిత క్రైస్తవులను విస్మరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఈ తీర్పు వల్ల రాష్ట్రంలోని 80 లక్షల మంది దళిత క్రైస్తవుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

అస్సాంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. గౌహతిలోని పార్టీ కార్యాలయంలో 'సంకల్ప పత్రం' పేరుతో ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం బీజేపీ అధ్యక్షుడు దిలీప్ సైకియా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టోలో మొత్తం 31 కీలక హామీలను ప్రకటించిన బీజేపీ, తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధికి ₹5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా యూసీసీ అమలు చేస్తామని హామీ ఇచ్చింది. అయితే రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ పరిధిలో ఉన్న ప్రాంతాలు, షెడ్యూల్డ్ తెగల ప్రాంతాలకు మినహాయింపు ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మాట్లాడుతూ ఆరవ షెడ్యూల్‌లో చేర్చబడిన ప్రాంతాలు, అలాగే షెడ్యూల్డ్ తెగలు నివసించే ప్రాంతాలు దీని నుంచి మినహాయిస్తామని స్పష్టం చేశారు. లవ్ జిహాద్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని.. అస్సాంను వరద రహిత రాష్ట్రంగా మార్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. జిల్లాకు ఒక వైద్య కళాశాల, ఒక విశ్వవిద్యాలయం, ఒక ఇంజనీరింగ్ కళాశాల తీసుకురావడమే తన లక్ష్యమన్నారు. రాబోయే ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తానని చెప్పారు. అంతే కాకుండా రాష్ట్రంలో వరద సమస్యను పూర్తిగా నివారించేందుకు తొలి రెండు సంవత్సరాల్లో ₹18,000 కోట్ల ప్రాజెక్టులను అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని 'వరద రహిత అస్సాం'గా మార్చడమే లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గత 60 ఏళ్లలో సాధించలేని అభివృద్ధిని బీజేపీ పదేళ్లలో సాధించిందని, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్‌కు స్పష్టమైన దృష్టి లేదని ఆరోపించారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం బయటకు వెళ్లిన అస్సాం యువత, ఇప్పుడు రాష్ట్రంలో పెరిగిన అవకాశాల కారణంగా తిరిగి వస్తున్నారని ఆమె అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1,04,488 చేనేత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికంగా కొండంత అండగా ఉండనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏడాదికి 150 కోట్లు అదనపు భారాన్ని భరిస్తూ, నేతన్నల కష్టార్జితాన్ని మిగిల్చే ప్రయత్నం చేస్తోంది. దీనివల్ల ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.8,640 వరకు, పవర్ లూమ్ యూనిట్లకు రూ. 21,600 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. కేవలం మాటలకే పరిమితం కాకుండా, విద్యుత్ ఛార్జీల భారం నుంచి చేనేత కళాకారులను విముక్తం చేసి, వారి వృత్తిని గౌరవప్రదంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కేవలం విద్యుత్ రాయితీ మాత్రమే కాకుండా, నేతన్నల పెన్షన్‌ను 4 వేలకు పెంచడం, త్రిఫ్ట్ ఫండ్ నిధుల విడుదల, ఆధునిక యంత్రాలపై 90 శాతం రాయితీ వంటి చర్యలతో కూటమి ప్రభుత్వం చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకొస్తోంది. ముఖ్యంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతో మార్కెటింగ్ అనుసంధానం చేయడం ద్వారా నేతన్నల ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు లభించేలా చేయడం మంచి పరిణామం. 

మధ్యతరగతి వారు మంచి మైలేజీ అందించే బైకుల కోసం చూస్తుంటారు. టూ వీలర్ తయారీ కంపెనీలు మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన ఫీచర్లతో బైకులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ బైక్‌లు మంచి మైలేజీని అందించడమే కాకుండా, వాటి నిర్వహణ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ బైక్‌లు భారతదేశంలో ప్రజాదరణ పొందాయి. 

బజాజ్ CT 110X : బరువైన వస్తువులను మోయడానికైనా లేదా రగడ్ టెర్రైన్ లో ప్రయాణించడానికైనా, ఈ బైక్ దాని మన్నికకు ప్రసిద్ధి చెందింది. దీని ధర రూ.67,280 (ఎక్స్-షోరూమ్), ఇది లీటరు పెట్రోల్‌కు 70 కి.మీ/లీ మైలేజీని అందిస్తుంది.

టీవీఎస్ రైడర్ బైక్ కొత్త, అధునాతన ఫీచర్ల విషయానికి వస్తే, టీవీఎస్ రైడర్ నిస్సందేహంగా ఒక మంచి ఎంపిక. రూ.81,050 (ఎక్స్-షోరూమ్) ధర కలిగిన ఈ బైక్‌ను ఒక హై-టెక్ మోటార్‌సైకిల్‌గా పరిగణిస్తారు. ఇంధన సామర్థ్యం పరంగా, ఇది లీటర్ పెట్రోల్‌కు 56.7 kmpl మైలేజీని అందిస్తుంది.

హీరో గ్లామర్ X బైక్ ప్రారంభ ధర రూ.82,967 (ఎక్స్-షోరూమ్). ఇది 125cc ఇంజన్‌తో పనిచేస్తుంది. 65kmpl మైలేజీని ఇస్తుంది (ARAI). ప్రతిరోజూ పనికి వెళ్లేవారు, స్టైల్‌ను కొనసాగిస్తూ డబ్బు ఆదా చేయాలనుకునే వారికి ఈ బైక్ చాలా అనువైనది.

బజాజ్ పల్సర్ N12 బైక్ ధరలు రూ.91,690 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. దీని స్టైలిష్ లుక్ 125cc ఇంజన్ కారణంగా యువతలో ఒక ప్రముఖ ఎంపికగా నిలిచింది. ఇంధన సామర్థ్యం పరంగా, ఇది గంటకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని ARAI పేర్కొంది.

హైదరాబాద్ లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కైతలాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపి, ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం  సదరు మహిళ తన ఇద్దరు పిల్లలు కార్తీక్ (12), కౌశిక్ (10) లతో కలిసి రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటుంది. కుటుంబ తగాదాల కారణంగా భర్త ప్రవీణ్ దూరంగా ఉంటున్నాడు. అయితే, అతను ఇటీవలే రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ తన ఇద్దరు కొడుకులను చంపి, ఆ తరువాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. దీనిని గమనించిన స్థానికులు కూకట్‌పల్లి పీఎస్‌కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టోమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎక్స్ వేదికగా ద్వారా హింసకు భవిష్యత్తు లేదు, శాంతికి మాత్రమే ఉంది. ఇంకా అండర్‌గ్రౌండ్‌లో ఉన్న వారికి నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను - ముప్పల్లా లక్ష్మణ రావు అలియాస్ గణపతి, పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, వర్థా శేఖర్ అలియాస్ మంగ్తు, జోడె రత్నబాయి అలియాస్ సుజాత, నక్క సుశీల అలియాస్ రేలా, రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, వీరందరూ ఆయుధాలు పడేసి, గౌరవం, భద్రత, చెందుబాటు కలిగిన జీవితాన్ని ఎంచుకోవాలని  కోరారు. గత రెండు సంవత్సరాల్లో 721 మంది వ్యక్తులు ఈ మార్గాన్ని విశ్వసించి, మెయిన్‌స్ట్రీమ్‌లో విజయవంతంగా తిరిగి చేరుకున్నారు. మా పునరావాస విధానం ద్వారా తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు. ఇంకా తమ కుటుంబాల నుంచి దూరంగా ఉన్నవారికి, ఇది మీ తిరిగి వచ్చే సమయం. తెలంగాణ ప్రభుత్వం మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కేవలం పునరావాసం మాత్రమే కాదు, గౌరవంతో, అవకాశాలతో, శ్రద్ధతో. అవసరమైన వారికి ప్రత్యేక హామీ ఇస్తున్నాం, అందులో అధునాతన వైద్య సహాయం కూడా ఉంది. మీ శ్రేయస్సు మాకు ముఖ్యం. హింసను వదిలి, అభివృద్ధి, ప్రజాస్వామ్యం, మంచి రేపటి వైపు కలిసి ముందుకు సాగుదామని డీజీపీ కోరారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పరిపాలన పరంగా భారీ మార్పులు మొదలయ్యాయి. గత కొన్నేళ్లుగా ఒకే చోట తిష్టవేసి, ఆలయ యంత్రాంగాన్ని తమ గుప్పిట్లో ఉంచుకున్న అధికారులపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉక్కుపాదం మోపింది. ఇందులో భాగంగానే దేవదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. చాలా కాలంగా యాదగిరిగుట్ట దేవస్థానంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డి. భాస్కర్ శర్మను వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో పి. నవీన్ కుమార్‌ను నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే, ఇది కేవలం సాధారణ బదిలీ మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు ఆరోపణలు ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానంలో కొందరు అధికారులు దశాబ్ద కాలంగా పాతుకుపోయారు. రాజకీయ అండదండలతో, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో వీరు తమ సీట్లను కాపాడుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా భాస్కర్ శర్మ వంటి అధికారులు కారుణ్య నియామకం ద్వారా విధుల్లో చేరినప్పటికీ, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని బదిలీలు కాకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో నవీన్ కుమార్ వంటి సీనియర్ అధికారులు ఇక్కడికి వచ్చినప్పుడు, వారికి కీలక బాధ్యతలు అప్పగించకుండా, కేవలం నామమాత్రపు సెక్షన్లకే పరిమితం చేసి, పాత అధికారులే పెత్తనం చెలాయించేవారని తెలుస్తోంది. తాజా ప్రభుత్వ నిర్ణయం ఈ 'రాజకీయ గుత్తాధిపత్యానికి' బ్రేక్ వేసినట్లయింది. ఆలయంలోని కొందరు అధికారులు భక్తుల సౌకర్యాల కంటే వీవీఐపీల సేవకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల ఇళ్లకు నేరుగా స్వామివారి ప్రసాదాలను, శేషవస్త్రాలను పంపడం ద్వారా తమ పలుకుబడిని పెంచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ బదిలీ అయినా, డిప్యూటేషన్ పేరుతో కొద్ది రోజుల్లోనే తిరిగి యాదగిరిగుట్టకే చేరుకోవడం ఇక్కడి అధికారులకు అలవాటుగా మారింది. గతంలో వేములవాడ, కొమురవెల్లి వంటి ప్రాంతాలకు బదిలీ అయిన వారు రాజకీయ ఒత్తిళ్లతో మళ్లీ ఇక్కడికే వచ్చేవారు. తాజా బదిలీ వేటుతో ఆలయంలోని ఇతర విభాగాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సహాయ కార్యనిర్వహణ అధికారులు, పర్యవేక్షణ అధికారుల్లో భయం మొదలైంది. ప్రభుత్వం గనుక ప్రక్షాళన కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తే, ఆలయ పరిపాలనలో పారదర్శకత పెరుగుతుందని సామాన్య భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. "స్వామివారి సన్నిధిలో రాజకీయాలకు తావుండకూడదు. అధికారులు భక్తులకు సేవ చేయాలి కానీ, నాయకుల చుట్టూ తిరగడం సరైంది కాదు. ఈ బదిలీలు మంచి పరిణామం" అని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం కుంతనహాల్ గ్రామంలో తండ్రి రెండో భార్యకు పుట్టబోయే బిడ్డకు ఆస్తి ఎక్కడ ఇస్తాడోనని భయంతో నిద్రిస్తున్న తండ్రిని కుమారుడు కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. కుంతనహాల్ గ్రామానికి చెందిన నన్నేసాబ్ (47)కు మొదటి భార్య ద్వారా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, నన్నేసాబ్ రెండో భార్య ప్రస్తుతం గర్భిణి కావడంతో కుటుంబంలో ఆస్తి చిచ్చు మొదలైంది. రెండో భార్యకు పుట్టబోయే సంతానానికి కూడా ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందని, తండ్రి తన వాటా తగ్గించేస్తాడని మొదటి భార్య పెద్ద కుమారుడు నూర్ మహమ్మద్ గత కొంతకాలంగా అనుమానంతో వున్నాడు. నూర్ మహమ్మద్ తన తండ్రి నన్నేసాబ్‌ను ఆస్తి పంపకాలు చేయాలని గత కొన్ని రోజులుగా నిలదీస్తున్నాడు. దీనిపై నన్నేసాబ్ స్పందిస్తూ, ప్రస్తుతం ఉన్న ఆస్తి కుటుంబ పెద్దల పేరు మీద ఉందని, తన అన్నదమ్ములు ఆస్తి భాగాలు పంచుకున్న తర్వాత తనకు వచ్చే వాటా నుండి కుమారులకు న్యాయం చేస్తానని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, తండ్రి మాటలను నూర్ మహమ్మద్ నమ్మలేదు. తండ్రి తనను మోసం చేస్తున్నాడని, ఆస్తి మొత్తం రెండో భార్య సంతానానికి ఇచ్చేస్తాడని భావించి కక్ష పెంచుకుని తండ్రిని కడతేర్చాడు.

తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు ఏప్రిల్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) తమ కార్యాచరణను ప్రకటించింది. సమ్మెకు ముందుగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా, సోమవారం నాడు అఫ్జల్‌గంజ్ విద్యుత్తు డివిజన్ (సిటీ-8) కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. తమ డిమాండ్లకు అనుకూలంగా నినాదాలు చేస్తూ, యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వం మరియు విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు తమ సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్లే సమ్మెకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఫైనాన్షియల్ అడ్వైజర్లలో ఒకరైన పి.ఆర్. రమేష్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ 'VerSe Innovation' ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకుంది. ఆయన బోర్డులో సభ్యుడిగానే కాకుండా, ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరించనున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్‌గా 40 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉన్న పి.ఆర్. రమేష్, గతంలో డెలాయిట్ ఇండియా ఛైర్మన్‌గా పనిచేశారు. డెలాయిట్ గ్లోబల్ బోర్డులో కూడా సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం పి.ఆర్. రమేష్‌ ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల బోర్డుల్లో కొనసాగుతున్నారు. 2022-23 సంవత్సరానికి గాను ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ నుండి "బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్" అవార్డును అందుకున్నారు. సెబీ, ఆర్బీఐ, ఐఆర్డీఏ వంటి నియంత్రణ సంస్థల అడ్వైజరీ కమిటీల్లో సభ్యుడిగా ఉండి, దేశ ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.VerSe సహ-వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ మాట్లాడుతూ, "ఒక సంస్థ కాలపరీక్షను తట్టుకొని నిలబడాలంటే బలమైన ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత అవసరం. రమేష్ గారి అనుభవం మా గవర్నెన్స్ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు. పి.ఆర్. రమేష్ స్పందిస్తూ "డిజిటల్ రంగంలో VerSe అద్భుతమైన స్థాయికి చేరుకుంది. సంస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ జవాబుదారీతనం, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి వ్యవస్థలు కూడా అదే స్థాయిలో పటిష్టంగా ఉండాలి. బాధ్యతాయుతమైన వృద్ధి దిశగా మేనేజ్‌మెంట్ టీంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని తెలిపారు.

తెలంగాణలో మహాలక్ష్మి (మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం) పథకం ద్వారా లబ్ధిదారులైన మహిళలు కోట్ల సంఖ్యలో పొందిన ఉచిత ప్రయాణాల విలువ రూ. 10,000 కోట్ల చరిత్రాత్మక మార్కును చేరుకుందని టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. ఈ చారిత్రాత్మక విజయాన్ని వేడుకగా జరుపుకోవడానికి, ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించిన లబ్ధిదారులను అభినందించడానికి టీజీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని ఇవాళ సాయంత్రం బేగంపేటలోని జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్ లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ పాల్గొనున్నారు. మహాలక్ష్మి పథకం 2023 డిసెంబరు 9న ప్రారంభం కాగా, ఈ స్కీమ్ ద్వారా మహిళలు ఏకంగా రూ.10వేల కోట్లను ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మహిళలు సుమారు 290 కోట్ల సార్లు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించినట్లు ప్రభుత్వం చెబుతోంది. మహాలక్ష్మి స్కీమ్ సేవల కోసం త్వరలో మహిళలకు చిప్ ఆధారిత స్మార్ట్ కార్డులు ఇస్తామని టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. రోజుకు సగటున 35 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని, పథకం తర్వాత మహిళా ప్రయాణికుల శాతం 40 నుంచి 67కు పెరిగిందని అధికారులు తెలిపారు.       

దేశీయ మార్కెట్లో లావా 'బోల్డ్' సిరీస్‌ నుండి కొత్త లావా బోల్డ్ ఎన్ 2 ప్రోను లాంచ్ చేసింది. గత నెలలో విడుదలైన బోల్డ్ N2 కి కొనసాగింపుగా బడ్జెట్ ధరలో అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. కేవలం రూ. 7,999 ధరతో లభించే ఈ ఫోన్ సామాన్య వినియోగదారులకు సైతం ప్రీమియం అనుభూతిని అందించేలా ఉంది.  ఈ స్మార్ట్‌ ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD స్క్రీన్‌ ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ తో వచ్చే ఈ డిస్ప్లే గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ సమయంలో అద్భుతమైన స్మూత్ అనుభూతిని ఇస్తుంది. ఇందులో UNISOC T7250 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ ను ఉపయోగించారు. అలాగే 4GB ఫిజికల్ ర్యామ్‌ తో పాటు అదనంగా మరో 4GB వర్చువల్ ర్యామ్ సౌకర్యం ఉండటం విశేషం. ఇది ఆండ్రాయిడ్ 15 OSపై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 50MP మెయిన్ రియర్ కెమెరాను అందించారు. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరా ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఇందులో 5000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీనికి తోడు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, IP54 రేటింగ్ ఉండడంతో దుమ్ము, చినుకుల నుండి రక్షణ లభిస్తుంది. ఇది ఎక్లిప్స్ గ్రే, ఆరోరా గోల్డ్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. 4GB + 128GB వేరియంట్ ధరను రూ. 7,999 గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ ఫోన్ ఏప్రిల్ 6 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌ కార్ట్లో అందుబాటులోకి రానుంది. ఎటువంటి అదనపు యాప్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఛాయస్.

హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం ఈ మార్గం గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్ కరెన్సీ రూపంలో టోల్ చెల్లించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. ఈ ప్రణాళికలో భాగంగా ఆర్థికపరమైన అంశాలే కాకుండా, జలసంధి భద్రత, పర్యావరణ పరిరక్షణ, నౌకల భద్రత బాధ్యతలను ఇరాన్ తన పరిధిలోకి తీసుకుంది. అమెరికా-ఇజ్రాయెల్‌, అలాగే ఇరాన్‌పై ఏకపక్షంగా ఆంక్షలు విధించే దేశాల నౌకలు ఈ జలసంధి గుండా ప్రయాణించడాన్ని ఇరాన్ పార్లమెంట్ పూర్తిగా నిషేధించింది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని బలపరిచే విధంగా ఈ ప్రణాళిక రూపొందించబడినట్లు అధికారులు తెలిపారు.

కొత్తగా లాంచ్ అయ్యే ప్రాజెక్టుల కోసం గతంలో వేచి చూసే మధ్యతరగతి ప్రజలు, ఇప్పుడు తమ చూపును రెడీ-టు-మూవ్ లేదా రీసేల్ ఫ్లాట్ల వైపు మళ్లిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడమే. సిమెంట్, స్టీల్ ధరలతో పాటు లేబర్ ఛార్జీలు కూడా గత ఏడాదితో పోలిస్తే 3-5% వరకు పెరగడం భారాన్ని పెంచింది. ఈ అదనపు భారాన్ని వారు కస్టమర్లపైనే వేస్తుండటంతో కొత్త ఫ్లాట్ల ధరలు సామాన్యుడి బడ్జెట్ దాటిపోతున్నాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను కొనుగోలు చేయడం వల్ల ఆర్థికంగా రెట్టింపు భారం పడుతోందని సగటు ఇన్వెస్టర్ భావిస్తున్నాడు. ఒకవైపు ఫ్లాట్ కోసం తీసుకున్న లోన్ ఇఎంఐ కడుతూనే, మరోవైపు ప్రస్తుతం ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించడం మధ్యతరగతి కుటుంబాలకు కష్టతరంగా మారింది. దీనికి తోడు ప్రాజెక్ట్ అనుకున్న సమయానికి పూర్తవుతుందా? లేదా? అనే సందిగ్ధత కూడా వారిని వెంటాడుతోంది. అదే రెడీ-టు-మూవ్ ఫ్లాట్ అయితే, వెంటనే గృహప్రవేశం చేసి అద్దె భారం తగ్గించుకోవచ్చనేది వారి ఆలోచన. దీంతో పాత ఫ్లాట్లకు ఉన్న డిమాండ్ ఈ వారాంతపు మార్కెట్ ట్రెండ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. రీసేల్ ఫ్లాట్ల వైపు మొగ్గు చూపడానికి మరో బలమైన కారణం స్పేస్ . 2026లో వస్తున్న కొత్త లాంచ్‌లలో లోడింగ్ ఫ్యాక్టర్ 35 నుండి 40 శాతం వరకు ఉంటోంది. అంటే మీరు 1600 చదరపు అడుగుల ఫ్లాట్ కొంటే, అందులో నివసించడానికి దక్కే స్థలం తక్కువగా ఉంటోంది. కానీ, 8-10 ఏళ్ల క్రితం కట్టిన పాత అపార్ట్‌మెంట్లలో లోడింగ్ ఫ్యాక్టర్ కేవలం 20-25 శాతం మాత్రమే ఉండేది. అంటే అదే ధరలో పాత ఫ్లాట్ కొంటే ఎక్కువ స్థలం, పెద్ద గదులు వస్తాయని కొనుగోలుదారులు గణిస్తున్నారు. పైగా పాత భవనాలలో యుడిఎస్ కూడా ఎక్కువగా లభిస్తుండటం భవిష్యత్తు పెట్టుబడిగా వారు భావిస్తున్నారు. కొత్త ఫ్లాట్లపై 5 శాతం జిఎస్‌టి అదనంగా ఉండటం, కానీ పూర్తిస్థాయిలో సిద్ధమైన ఫ్లాట్లకు జిఎస్‌టి లేకపోవడం కూడా కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. రూ.15 లక్షలు వెచ్చించి పాత ఫ్లాట్‌ను కొత్తగా రినోవేట్ చేసుకున్నా, అది కొత్త లాంచ్ కంటే తక్కువ ధరకే వస్తోందని మధ్యతరగతి కుటుంబాలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ పరిణామాల వల్ల ప్రస్తుతం మార్కెట్లో రీసేల్ మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది.

కువైట్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై ఇరాన్‌ భీకర దాడిచేసింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఈ ఘటనను ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. కువైట్‌కు చెందిన 'అల్‌ సల్మీ' అనే భారీ ముడిచమురు నౌక దుబాయ్‌ పోర్టు వద్ద ఉంది. దీనిపై ఇరాన్‌ డ్రోన్‌తో దాడి చేయగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటన తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ 24 మంది సిబ్బంది సురక్షితంగానే ఉన్నారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ధ్రువీకరించారు. అయితే దాడి సమయంలో ట్యాంకర్‌ నిండా చమురు ఉన్నట్లు తెలుస్తోంది. సముద్ర జలాల్లో చమురు ఒలికే ప్రమాదం ఉందని కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ఘటనను దుబాయ్‌ అధికారులు కూడా ధ్రువీకరించారు. రెస్క్యూ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చినట్లు వెల్లడించారు.

బీహార్ రాష్ట్రం నలందలోని ప్రసిద్ధ శీతల మాత ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరికొంతమంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆలయ పరిసరాల్లో హాహాకారాలు మిన్నంటాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించే క్రమంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అత్యవసర సమయంలో అంబులెన్స్ సకాలంలో చేరుకోకపోవడం పట్ల బాధితుల బంధువులు మరియు భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అంబులెన్స్ త్వరగా వచ్చి ఉంటే మరికొందరి ప్రాణాలు కాపాడగలిగేవారమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడిన వారికి సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

సీఆర్పీసీ సెక్షన్ 125 ప్రకారం కోడలు తన అత్తమామలకు భరణం చెల్లించాల్సిన చట్టపరమైన అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఒక మహిళపై ఆమె అత్తమామలు కోర్టును ఆశ్రయించారు. తమ కుమారుడు మరణించాడని, తాము వృద్ధులమని, నిరక్షరాస్యులమని, ఎటువంటి ఆదాయ వనరులు లేని పేదలమని వారు పేర్కొన్నారు. తమ కోడలు తన భర్తకు రావాల్సిన సర్వీసు ప్రయోజనాలన్నింటినీ పొందిందని, పైగా ఆమెకు స్వతంత్ర ఆదాయం ఉన్నందున తమను పోషించాల్సిన బాధ్యత ఆమెపై ఉందని వారు వాదించారు. గతంలో ఆగ్రాలోని కుటుంబ కోర్టు ఆగస్టు 2025లో వీరి పిటిషన్‌ను తిరస్కరించింది. తాజాగా భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 144 కింద తాము భరణం పొందేందుకు అర్హులమని కోరుతూ వృద్ధ దంపతులు వేసిన రీపిటిషన్‌పై జస్టిస్ మదన్ పాల్ సింగ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ మదన్ పాల్ సింగ్ చట్టంలోని నిబంధనలను విశ్లేషించారు. 'భరణం కోరే హక్కు అనేది కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రమే. సెక్షన్‌లో స్పష్టంగా పేర్కొన్న వ్యక్తుల వర్గాలకు (భార్య, పిల్లలు, తల్లిదండ్రులు) మాత్రమే ఇది పరిమితం. అత్తమామలు ఈ పరిధిలోకి రారు. నైతిక బాధ్యత అనేది ఎంత బలంగా ఉన్నప్పటికీ చట్టబద్ధమైన ఆదేశం లేని పక్షంలో దానిని చట్టపరమైన బాధ్యతగా అమలు చేయలేం' అని కోర్టు స్పష్టం చేసింది. అత్తమామలను ఈ నిబంధన పరిధిలోకి చేర్చకూడదని శాసనసభ తన విచక్షణతోనే నిర్ణయించిందని, కోడలిపై అత్తమామల పోషణ బాధ్యతను మోపడం చట్టం ఉద్దేశం కాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్లు వాదించినట్లుగా కోడలు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది. అలాగే, మరణించిన కుమారుడి ఆస్తి వారసత్వానికి సంబంధించిన అంశాలు ఇటువంటి భరణం కేసుల విచారణ పరిధిలోకి రావని హైకోర్టు తేల్చి చెప్పింది. చట్టం ప్రకారం తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమారుడిపై లేదా కుమార్తెపై ఉంటుంది తప్ప, కోడలిపై అత్తమామలను పోషించాలనే చట్టపరమైన నిబంధన లేదని ఈ తీర్పు ద్వారా మరోసారి స్పష్టమైంది. 

ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు ధాటికి స్టేషన్ భవనంతో పాటు బయట ఉన్న వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం పోలీసులు బయటి నుంచి స్వాధీనం చేసుకున్న కొంత మందుగుండు సామగ్రిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. పీఎస్ ఆవరణలో ఆ సామగ్రిని పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో స్థానిక ఎస్సై తో పాటు పోలీస్ వాహన డ్రైవర్ దుర్గాంజనేయులు, ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు శబ్దం విన్న వెంటనే తోటి సిబ్బంది, స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందుతోంది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో స్టేషన్ లోపల ఉన్న ఫర్నిచర్ పూర్తిగా చిందరవందర అయింది. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అంతేకాకుండా స్టేషన్ బయట నిలిపి ఉంచిన పోలీస్ వాహనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఘటన జరిగిన వెంటనే చల్లపల్లి సీఐ  కేఎస్ రావు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీంను రంగంలోకి దించి పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను ఆరా తీస్తున్నారు. స్టేషన్‌లో భద్రతపరమైన లోపాలు ఉన్నాయా లేదా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు సీజ్ చేయడం ఇప్పుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ భవనానికి సంబంధించి సుమారు రూ. 25 లక్షల వరకు ఆస్తి పన్ను బకాయిలు ఉండటంతో, పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో అధికారులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. జయలలిత బతికున్న కాలంలో ఈ భవనం ఆమెకు ఒక ప్రధాన ఆస్తిగా ఉండేది, కానీ ఆమె మరణం తర్వాత ఈ ఆస్తి వారసత్వం, నిర్వహణపై సందిగ్ధత ఏర్పడింది. జయలలిత మరణం తర్వాత ఆమె వందల కోట్ల ఆస్తులకు వారసులు ఎవరనే అంశంపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిగింది. 2020లో మద్రాస్ హైకోర్టు జయలలిత అన్న కుమారుడు జె. దీపక్, కుమార్తె జె. దీపలను ఆమెకు చట్టబద్ధమైన వారసులుగా ప్రకటించింది. ఈ తీర్పు ప్రకారం హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీ నివాసం, జీడిమెట్ల వద్ద ఉన్న ద్రాక్ష తోట తో పాటు ఇతర అన్ని స్థిరాస్తులు వీరిద్దరికే చెందుతాయి. కోర్టు వారసులుగా ప్రకటించినప్పటికీ, ఈ ఆస్తుల అప్పగింత ప్రక్రియ , ఆదాయపు పన్ను శాఖ జరిపిన అటాచ్‌మెంట్‌ల వల్ల వీరు పూర్తిస్థాయిలో వీటిని స్వాధీనం చేసుకోవడంలో జాప్యం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలోని ఈ భవనంలో ఎవరూ ఉండటం లేదు. అది ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. జయలలిత మరణానంతరం ఈ భవన పర్యవేక్షణను చూసే వారు కరువయ్యారు. గతంలో ఇక్కడ కేవలం సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉండేవారు. వారసులుగా ప్రకటించిన దీప, దీపక్ లు చెన్నైలోనే నివసిస్తుండటం, హైదరాబాద్ లోని ఆస్తుల నిర్వహణపై వారు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. అధికారులు భవనం గేటుకు నోటీసులు అంటించి సీజ్ చేసినప్పుడు కూడా అక్కడ ఎవరూ అందుబాటులో లేరు. జయలలిత ఆస్తులపై అప్పట్లో ఆదాయపు పన్ను శాఖ వేసిన కేసులు, అటాచ్‌మెంట్‌లు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీనికి తోడు, తమిళనాడు ప్రభుత్వం గతంలో ఈమె ఆస్తులను ప్రభుత్వ పరం చేసేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత కోర్టు అడ్డుకోవడం వంటి పరిణామాల వల్ల వారసులు దీప, దీపక్ లు క్షేత్రస్థాయిలో ఈ ఆస్తులపై పూర్తి నియంత్రణ సాధించలేకపోయారు. ఇప్పుడు మున్సిపల్ అధికారులు సీజ్ చేయడంతో, ఈ బకాయిలు చెల్లించి భవనాన్ని విడిపించుకోవాల్సిన బాధ్యత చట్టబద్ధ వారసులైన వారిద్దరిపైనే పడింది. ఒకవేళ వారు స్పందించని పక్షంలో అధికారులు తదుపరి వేలం ప్రక్రియకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

ఇరాన్ శక్తిమంతమైన సైనిక విభాగం ఐఆర్‌ జీసీ నావికాదళ కమాండర్ అలీ రెజా తంగ్సిరి కన్నుమూసినట్టు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడిలో తంగ్సిరి తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు వైద్యులు పలు శస్త్రచికిత్సలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయిందని, అలీ రెజా తుదిశ్వాస వదిలారని ఐఆర్ జీసీ అధికారిక వెబ్‌సైట్ 'సెపా న్యూస్' వెల్లడించింది. తమ కీలక కమాండర్ మృతికి కారణమైన వారిపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది.

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి దాదాపు అందరినీ అన్‌ఫాలో చేసి, ప్రస్తుతం కేవలం మూడు అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో మొదటిది ఆయన భార్య ప్రగతి శెట్టి అకౌంట్ కాగా, మిగిలిన రెండు ఆయన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘రిషబ్ శెట్టి ఫిల్మ్స్’, ఆయన స్వచ్ఛంద సంస్థ ‘రిషబ్ శెట్టి ఫౌండేషన్’ ఖాతాలు కావడం విశేషం. రిషబ్ శెట్టి ఇలా అందరినీ అన్‌ఫాలో చేయడానికి గల అసలు కారణంపై ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘జై హనుమాన్’ లోనూ, అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్’ లోనూ నటిస్తున్నారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులపై పూర్తి ఏకాగ్రత పెట్టేందుకే ఆయన సోషల్ మీడియా పరధ్యానానికి దూరంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొందరు భావిస్తున్నారు. అంతకుముందు ఆయన తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘కాంతార’ను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థను, ఆ చిత్రంలో నటించిన తన అత్యంత ఆప్తమిత్రుడు రాజ్ బి. శెట్టిని, హీరోయిన్ రుక్మిణి వసంత్‌లను అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరగందూర్‌ను ఆయన ఇంకా ఫాలో అవుతూనే ఉండటం గమనార్హం. 

భారత టెలికాం రంగాన్ని నియంత్రించే సంస్థ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గతంలోనే 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ గురించి దిశా నిర్ధేశం అందించింది. 2022 లో జరిగిన సమావేశం నుంచి ప్రతీ టెలికాం కంపెనీ కూడా 28 రోజుల ప్లాన్ తో పాటు కనీసం ఒక్కటైనా 30 రోజుల వ్యాలిడిటీ మరియు క్యాలెండర్ మంత్ ప్రీపెయిడ్ ప్లాన్ తన యూజర్ల కోసం అందించాలని ఆదేశించింది. టెలికాం కంపెనీలు అందించే 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ తో పాటు 30 మరియు నెల రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ను కూడా అందించాలి. అయితే, ఎక్కడా కూడా 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ లను రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. అయితే, 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ తో పాటు 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా యూజర్ కోసం ఎక్కువగా ఆఫర్ చేయాలనీ మాత్రమే ఆదేశించింది. తద్వారా యూజర్ కు అనువైన, అనుకూలమైన ప్లాన్ ను ఎంచుకునే అవకాశం ఉంటుందని ట్రాయ్ తెలిపింది. అయితే, సోషల్ మీడియాలో అసలు విషయాన్ని చెప్పకుండా "ప్రభుత్వం 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్లు రద్దు చేసి 30 రోజుల ప్లాన్ తప్పనిసరి చేసింది" అని అసత్య ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటు సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ ఛద్దా 28 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ వలన ప్రజలకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వానికి వినతి చేశారు. అంతేకాదు, వాటి స్థానంలో కొత్త 30 రోజులు మరియు నెల రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకురావాలని వినతి కూడా చేశారు. ఈ వినతి పై దృష్టి సారించిన ప్రభుత్వం కొత్త దిశ నిర్దేశాలు అందించింది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, అన్ని టెలికాం కంపెనీలు కూడా 28 రోజులకు దీటుగా 30 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్స్ కూడా తన యూజర్ల కోసం అందించాల్సి ఉంటుంది. కొత్త ఆదేశాల ప్రకారం 28 రోజుల ప్లాన్లు కొనసాగుతూనే ఉంటాయి. అదే సమయంలో 30 రోజుల ప్లాన్లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ కొత్త చర్య వల్ల వినియోగదారులకు మరింత సౌలభ్యం కలుగుతుంది.

పాకిస్తాన్ లో గ్యాస్‌ను అక్రమంగా నిల్వ చేయడం, దొంగిలించడాన్ని తీవ్రవాదంగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఒక బిల్లును సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే, పాకిస్తాన్‌లో చమురు, గ్యాస్‌లను నిల్వ చేయడం, అక్రమంగా రవాణా చేయడం, చట్టవిరుద్ధంగా భద్రపరచడం నేరంగా పరిగణిస్తారు. ప్రభుత్వం కోరుకుంటే, ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తిపై తీవ్రవాద చట్టాన్ని కూడా విధించవచ్చు. డాన్ వార్తాపత్రిక కథనం ప్రకారం, పాకిస్తానీ ప్రభుత్వం పార్లమెంటులో క్రిమినల్ లా (సవరణ) బిల్లు - 2026ను ప్రవేశపెట్టింది. చమురు, గ్యాస్ సంక్షోభానికి ప్రతిస్పందనగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మాఫియా కుమ్మక్కుతో చమురు సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, ఆ తర్వాత చమురును నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈమేరకు పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి అజం నజీర్ తారర్ ఈ బిల్లును ప్రవేశపెట్టిన తెలుస్తోంది. ఉగ్రవాదులు మొదట పైప్‌లైన్‌లను ధ్వంసం చేసి, ఆ తర్వాత మాఫియాల ద్వారా చమురు, గ్యాస్‌లను అమ్ముతున్నారని పాకిస్తానీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ డబ్బును పాకిస్తాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి ఉపయోగిస్తున్నారు. అందుకే పాకిస్తానీ ప్రభుత్వం చమురు, గ్యాస్‌కు సంబంధించి కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు డాన్ పత్రిక పేర్కొంది. ఇదిలావుంటే, సోమవారం, బలూచిస్థాన్‌లోని ఒక చమురు పైప్‌లైన్‌పై దాడి జరిగినట్లు వచ్చాయి. దీనివల్ల బలూచ్ రాజధాని క్వెట్టాతో సహా పలు ప్రాంతాలకు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ దాడులను ఎవరు, ఎందుకు చేశారనే దానిపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం అందించలేదు. 

తెలంగాణ అసెంబ్లీలో యుద్దం ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్, లెబనాన్ మీద దాడి చేస్తున్నాయని, ఇరాన్ కూడా గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్‌గా చేసుకొని దాడి చేస్తున్నదని తెలిపారు. ఫైటర్ బాంబర్సు, బాలెస్టిక్ మిస్సైల్స్, డ్రోన్స్ వంటి అత్యంత ఆధునికమైన ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయని, దీనివల్ల జరిగే విధ్వంసంలో అమాయకులు దాదాపు 4,000 మందిమరణించారని తెలిపారు. ఈ మరణాలతోపాటు, ఆర్థికపరమైన విధ్వంసం మరొక పక్కన జరుగుతున్నదన్నారు. మరణాలు అయా దేశాలకు మాత్రమే పరిమితమైతే ఆర్థిక విధ్వంసం ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్నదన్నారు. మరీ ముఖ్యంగా ఆసియా దేశాలకు మరింత ప్రమాదకరంగా మారిందని, మన దేశంపైన కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోందని, కనీసం ఇంతటితోనైనా ఈ యుద్దాన్ని ఆపకపోతే ప్రపంచ భవష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్దం ఇలాగే కొనసాగినా ఆపకపోయినా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి కూడా దారితీయవచ్చునన్నారు. ఇది ప్రపంచ మానవాళి మనుగడకే ముప్పు అని, ఇటువంటి అత్యంత ప్రమాదకర పర్యవసనాల దృష్ట్యా భారత ప్రభుత్వం చొరవ తీసుకుని యుద్ధాన్ని ఆపడానికి, ప్రపంచ శాంతిని నెలకొల్పడానికి తగిన చొరవ తీసుకోవాలని సభ ద్వారా కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అనంతరం సభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది.

ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో పాఠశాల ఉపాధ్యాయురాలి మందలింపు తట్టుకోలేక పదేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంపూర్‌కు చెందిన ఐదో తరగతి విద్యార్థిని, ఆమె చెల్లెలు శనివారం పాఠశాలకు వెళ్లగా, ఉదయం అసెంబ్లీలో వారి యూనిఫాం అపరిశుభ్రంగా ఉందనే కారణంతో ఒక మహిళా ఉపాధ్యాయురాలు అందరిముందు తీవ్రంగా మందలించారు. దీంతో అవమాన భారంతో వెక్కి వెక్కి ఏడుస్తూ ఇంటికి వెళ్లిన ఆ అక్కాచెల్లెళ్లు జరిగిన విషయాన్ని తల్లికి వివరించారు. మనస్తాపానికి గురైన పెద్దమ్మాయి కొద్దిసేపటికే ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ వార్త తెలియడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బాలిక మృతదేహంతో పాఠశాలను ముట్టడించి భారీ ఎత్తున నిరసన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎస్డీఎం, విద్యాశాఖాధికారులు అక్కడికి చేరుకుని బాధితులను శాంతింపజేశారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సదరు మహిళా ఉపాధ్యాయురాలు, పాఠశాల ప్రిన్సిపాల్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దక్షిణ సూడాన్ రాజధాని జుబాకు సమీపంలోని జెబెల్ ఇరాక్ బంగారు గని వద్ద గుర్తు తెలియని సాయుధ దుండగులు జరిపిన మారణహోమంలో 70 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గని వద్ద తలెత్తిన వివాదమే ఈ ఘోరానికి కారణం కాగా, మృతుల సంఖ్య 85 వరకు ఉండవచ్చని అనధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అనేకమంది తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. 2018 శాంతి ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, అక్రమ గనుల తవ్వకాలు మరియు సాయుధ గ్రూపుల ఆధిపత్య పోరు కారణంగా ఆ ప్రాంతంలో హింస రాజ్యమేలుతోంది. ఈ దారుణ ఘటనపై దక్షిణ సూడాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయనప్పటికీ, మైనింగ్ మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అంతర్జాతీయ సమాజం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. 

వృత్తి ఉద్యోగాలు, న్యూరోడైవర్జెంట్లను ఏఐ రీప్లేస్ చేయలేదని పాలంటిర్ అనే ఏఐ, డేటా అనలైటిక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవో అలెక్స్ కార్ప్ వెల్లడించారు. మీరు ఈ రెండు గ్రూపుల్లో ఉంటే ఏఐ మిమ్మల్ని ఏమీ చేయలేదంటూ చెప్పుకొచ్చారు.  టెక్నాలజీ బిజినెస్ ప్రోగ్రామింగ్ నెట్‌వర్క్ పాడ్‌కాస్ట్‌లో కార్ప్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో ఏఐ ఇంటిగ్రేషన్ గురించి చర్చించారు. ప్రతి రంగంలో ఏఐ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో జాబ్ మార్కెట్ ఫ్యూచర్‌పై ఆయన డిస్కస్ చేశారు. దీంతో, చాలా మంది ఉద్యోగులు తమ జాబ్స్‌ విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ రెండు గ్రూపుల వారు మాత్రం సురక్షితంగా ఉండొచ్చు. వృత్తి ఉద్యోగాలు చేసేవారు, న్యూరోడైవర్జెంట్లు మాత్రమే ఎలాంటి ఆందోళన లేకుండా గడపొచ్చు. ఈ రెండు వర్గాల వారికి మాత్రం ఉద్యోగ భవిష్యత్తు ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు చేసేవారిలో సాధారణంగా ప్లంబర్లు, టెక్నిషియన్లు, మెకానిక్ వంటి రోల్స్ ఉంటాయి. ఇలాంటి వారికి వృత్తి పరమైన శిక్షణ అవసరం పడుతుంది. దీంతో, ఈ వృత్తులను ఆటోమేట్ చేయడం కష్టమని భావిస్తారు. మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణతో వీటికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ వృత్తి ఉద్యోగాలను ఏఐ భర్తీ చేసే ఛాన్స్ లేనందున వీటని సేఫ్ జాబ్స్‌గా ఆంథ్రోపిక్ రీసెంట్ నివేదిక సైతం పేర్కొంది. న్యూరోడైవర్జెంట్ వ్యక్తులు ఏఐ నుంచి సురక్షితంగా ఎందుకు ఉండగలరో అలెక్స్ కార్ప్ వివరించారు. న్యూరోడైవర్సిటీ అనేది సాధారణంగా ADHD, ఆటిజం, డిస్‌లెక్సియా, ఇతర పరిస్థితులను కలిగి ఉండే ఒక పదం. తన సొంత డిస్‌లెక్సియా గురించి బహిరంగంగా మాట్లాడిన కార్ప్, న్యూరోడైవర్జెంట్ వ్యక్తులు మరింత క్రియేటివ్ సొల్యూషన్స్ కనుగొనగలరు. కాబట్టి, భవిష్యత్తులో వారు ఒక అదనపు ప్రయోజనాన్ని పొందగలరు. ఎక్కువగా ఆర్టిస్టులా ఉండగలిగే, విషయాలను భిన్నమైన కోణంలో చూడగలిగే, ప్రత్యేకమైన దాన్ని నిర్మించగలిగే వారినే విజయం వరిస్తుంది. టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్, పేపాల్ కో ఫౌండర్ పీటర్ థీల్ సైతం ఈ క్యాటగిరీకి చెందినవారే. పాలంటిర్ సంస్థ గతేడాది డిసెంబరులో ప్రత్యేకమైన 'న్యూరోడైవర్జెంట్ ఫెలోషిప్'ని స్టార్ట్ చేసింది. సంప్రదాయ అభ్యర్థుల కంటే భిన్నంగా ఆలోచించే ప్రతిభావంతులను ఈ ఫెలోషిప్‌కి ఎంపిక చేస్తోంది. లాస్ట్ స్టేజ్ ఇంటర్వ్యూలో కార్ప్ స్వయంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఏఐ భర్తీ చేయలేని ఉద్యోగాల గురించి వ్యూహాత్మకంగా చర్చించారు. అమెరికా, పశ్చిమ దేశాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో న్యూరోడైవర్జెంట్ వ్యక్తులు అసమానమైన పాత్ర పోషిస్తారంటూ ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలంటూ రాజ్యసభలో కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ మాట్లాడుతూ రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్ లోపాలే కారణమని ఆయన పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై ఎన్డీఎస్ఏ  నివేదికను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రమంత్రి సి.ఆర్.పాటిల్ ధ్వజమెత్తారు. రాష్ట్రం వద్ద రూ.873 కోట్లు ఉన్నా మూడేళ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.194 కోట్లేనని ఆయన గుర్తు చేశారు. మూడేళ్లుగా ఒక్క కొత్త స్కీమ్ ప్రతిపాదన కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి రాలేదని కేంద్ర మంత్రి సి.ఆర్.పాటిల్ పెదవి విరిచారు. మరోవైపు తెలంగాణకు చెందిన రాజ్యసభ్య సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై సీబీఐ చే విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

నక్సలిజం నిర్మూలనపై లోక్ సభలో చర్చ మెుదలైంది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని అమిత్ షా హెచ్చరించారు. బస్తర్‌లో ప్రస్తుతం మావోలు లేరని మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని వెల్లడించారు. బస్తర్‌లో ఆదివాసీలకు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. అభివృద్ధి దిశగా బస్తర్‌ ప్రాంతం ముందుకెళ్తోందని తెలిపారు. మావోల లొంగుబాటుకు రేపే ఆఖరి తేదీ అని, అభివృద్ధి లేదంటూ ఆయుధాలు పట్టుకోవడం సరికాదని హితవుపలికారు. ఆయుధాలు వీడని వారి అంతు చూస్తామని ఈ సందర్భంగా అమిత్ షా హెచ్చరించారు. కాంగ్రెస్‌ హయాంలో విలీన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని, కాంగ్రెస్‌ పాలనలోనే గిరిజన ప్రాంతాలు ఎందుకు అభివృద్ధి చెందలేదని ప్రశ్నించారు. వారి పాలనలో బస్తర్‌ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని.. గిరిజనులను 60 ఏళ్లపాటు కాంగ్రెస్‌ విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నిర్వాకం వల్లే దేశంలో మావోయిజం పెరిగిందని కేంద్ర హోంమంత్రి ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో హైడ్రామా చేస్తున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ తీవ్రంగా విమర్శించారు. మండల కేంద్రమైన క్రిష్ణగిరిలో నేడు విలేకరులతో మాట్లాడిన ఆమె, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ వైఫల్యాలను దాచిపెట్టేందుకు అమరావతి రాజధాని అంశాన్ని ముందుకు తెచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అమరావతి ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి కనిపించడం లేదని, అవినీతి జరుగుతుందని ప్రశ్నిస్తే బురదజల్లడం సీఎం చంద్రబాబుకు అలవాటైపోయిందన్నారు. అమరావతి రాజధానికి ఎవరు అడ్డుపడుతున్నారో, ఎవరు వ్యతిరేకిస్తున్నారో, ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి వచ్చిందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను పక్కదారి పట్టించే కుట్రలో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా నిర్వహించారని విమర్శించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా సరైన స్థితిలో లేవని, కొన్ని చెరువుల్లో ఉన్నాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. అమరావతిని టీడీపీ నేతలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. 2028లోపు రాజధాని పూర్తి చేస్తామని చెబుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, మూడు పంటలు పండే లక్షల ఎకరాల భూములను రైతుల నుంచి సేకరించి తమ అనుచరులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఎంకే స్టాలిన్ ఇవాళ కోలతూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం నుంచే ఆయన 2011, 2016, 2021 ఎన్నికల్లో గెలిచారు. నామినేషన్‌ దాఖలు చేసిన వెంటనే స్టాలిన్ రోడ్ షో నిర్వహించారు. కోలతూర్ నియోజకవర్గంలో చేయాలనుకుంటున్న అభవృద్ధి పనులపై స్టాలిన్‌ ఓ పుస్తకం విడుదల చేశారు. "మేము భారీ విజయం సాధించనున్నాం. గత మూడు ఎన్నికలతో పోల్చితే ఈ సారి మరింత భారీగా మద్దతు కనపడుతోంది. ఇది యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్. తమిళనాడు ఢిల్లీకి వ్యతిరేకంగా పోరాడుతోంది. ఈ సారి భారీ విజయం సొంతమవుతుంది" అని స్టాలిన్ చెప్పారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విజయ్‌ చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చిన విజయ్‌ నామినేషన్ సమర్పించారు. విజయ్‌తో పాటు పార్టీ జనరల్ సెక్రటరీ ఎన్ ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వంటి సీనియర్ నాయకులు ఉన్నారు.

తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న విద్వేష పూరిత పోస్టులకు, విమర్శలకు అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టిన తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్ - 2026 ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో , సోషల్ మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త చట్టం ప్రకారం సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో ఎవరైనా హద్దు మీరితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ కొత్త బిల్లు ప్రకారం, కులం, మతం, ప్రాంతం , ఇతర విభజన అంశాల ప్రాతిపదికన వ్యక్తులను లేదా వర్గాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. మొదటిసారి నేరానికి పాల్పడే వారికి ఒక ఏడాది నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీనితో పాటు రూ.50,000 వరకు జరిమానా కూడా విధించవచ్చు. ఒకవేళ ఇదే నేరాన్ని రెండోసారి లేదా పదే పదే చేస్తే, శిక్షా కాలం పదేళ్లకు పెరుగుతుంది . జరిమానా కూడా లక్ష రూపాయల వరకు ఉంటుంది. ఈ నేరాలు నాన్-బెయిలబుల్ గా పరిగణిస్తారు. ఈ చట్టం కేవలం శిక్షలకే పరిమితం కాకుండా, బాధితులకు న్యాయం చేసే దిశగా కూడా అడుగులు వేసింది. విద్వేషపూరిత పోస్టుల వల్ల బాధితులు అనుభవించిన మానసిక వేదన లేదా ఇతర నష్టాలను బట్టి కోర్టులు వారికి తగిన పరిహారం ఇప్పించే వెసులుబాటు కల్పించారు. అలాగే, ఏదైనా అభ్యంతరకరమైన కంటెంట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంటే, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి సంబంధిత నెట్‌వర్క్ ప్రొవైడర్లు, ఇంటర్మీడియరీలకు ఆదేశాలు జారీ చేసి ఆ పోస్టులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటారు. కేవలం వ్యక్తులపైనే కాకుండా, విద్వేషాన్ని ప్రచారం చేసే సంస్థలు లేదా ఇన్సిట్యూషన్లపై కూడా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఒక సంస్థ ద్వారా ఇలాంటి తప్పు జరిగితే, ఆ సంస్థ నిర్వహణలో ఉన్న ప్రతి ఒక్కరినీ బాధ్యులను చేస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. డిజిటల్ యుగంలో సమాచార వ్యాప్తి వేగంగా జరుగుతున్న తరుణంలో, సామాజిక సామరస్యాన్ని కాపాడటం కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం ఈ బిల్లును సామాజిక బాధ్యతగా చెబుతుంటే, విపక్షాలు మాత్రం దీనిని తమ గొంతు నొక్కే ప్రయత్నంగా చూస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ విమర్శలను కూడా హేట్ స్పీచ్ కింద జమకట్టి అరెస్టులు చేసే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇరాన్‌పై దాడులకు తమ సైనిక స్థావరాలు, గగనతలాన్ని ఉపయోగించడానికి అమెరికాను అనుమతించమని  స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీటా రోబ్లెస్ స్పష్టం చేశారు. ఇరాన్‌పై ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించబడిన యుద్ధంలో పాల్గొనకూడదని లేదా సహకరించకూడదని స్పెయిన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈ చర్య అని పేర్కొన్నారు. కాగా, ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను స్పెయిన్ మొదటి నుంచే తీవ్ర వ్యతిరేకిస్తోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను నిర్లక్ష్యపూరితమైనవిగా, చట్టవిరుద్ధమైనవిగా స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ ఇప్పటికే తీవ్రంగా విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జల సంధిని ఇరాన్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ దెబ్బతో ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడింది. కొన్ని దేశాల్లో ఇంధన సంక్షోభం తలెత్తింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక పిలుపునిచ్చారు. హార్మూజ్ జల సంధిలో చమురు నౌకలను కాపాడుకునేందుకు, రవాణాకు ఆటంకం లేకుండా చూసేందుకు అమెరికా మిత్ర దేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలను మోహరించాలని కోరారు. ఇరాన్ నుంచి హార్మూజ్ జల సంధికి స్వేచ్ఛ కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ట్రంప్ పిలుపుకు ఆశించిన స్పందన రాలేదు. హార్మూజ్ జల సంధిలో యుద్ధ నౌకలు మోహరించేందుకు చైనా నిర్ద్వందంగా తిరస్కరించింది. బ్రిటన్ కూడా ఇందుకు సముఖత వ్యక్తం చేయలేదు. యుద్ధం ఇప్పుడు ముగిస్తారో ముందు ట్రంప్ స్పష్టంగా చెప్పాలని యూరప్ కంట్రీస్ డిమాండ్ చేశాయి. ఇండియా అయితే ఈ అంశంపై రెస్పాండే కాకపోవడం గమనార్హం. దీంతో తమ మిత్రదేశాలపై ట్రంప్ నిప్పులు చెరిగారు. హార్మూజ్ జలసంధిలో ఇరాన్ సృష్టిస్తున్న అలజడిని అణచివేసేందుకు సైనిక సహకారం అందించని దేశాలను ఉద్దేశించి అత్యంత కఠినమైన పదజాలం వాడారు. మీరంతా పిరికివాళ్లు (కోవార్డ్స్).. క్లిష్ట సమయంలో మీరు చేసిన ఈ పనిని మేము ఎప్పటికీ గుర్తుంచుకుంటాం అంటూ హెచ్చరించారు. అమెరికా అండ లేకపోతే నాటో కేవలం ఒక 'కాగితపు పులి' అని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ "ఇన్‌స్టాగ్రామ్". ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులో లేని లేదా తక్కువ సిగ్నల్ ఉన్న ప్రాంతాల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లోడ్ అవ్వక వినియోగదారులు నిరుత్సాహపడటం సాధారణం. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా 'మెటా' యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ త్వరలో 'ఆఫ్‌లైన్ రీల్స్' ఫీచర్‌ను తీసుకురాబోతోంది. ఇది ఇంటర్నెట్ లేకుండానే రీల్స్‌ను చూసేందుకు అవకాశం కల్పిస్తుంది. టిప్‌స్టర్ ఎక్స్  వేదికగా పంచుకున్న స్క్రీన్‌షాట్‌ల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్ ఒక ఆటోమేటిక్ డౌన్‌లోడ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ సిస్టమ్, వినియోగదారుల ఆసక్తికి అనుగుణంగా కొన్ని రీల్స్‌ను ముందుగానే డౌన్‌లోడ్ చేసి ఉంచుతుంది. దీని ద్వారా డేటా లేనప్పుడు కూడా నిరంతర వినోదాన్ని పొందవచ్చు. ఈ కొత్త ఫీచర్ వినియోగదారులకు పూర్తి నియంత్రణను అందిస్తుంది. వై-ఫై అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే రీల్స్‌ను ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఫోన్ స్టోరేజ్ నిండిపోకుండా ఉండటానికి, 10, 30 లేదా 50 రీల్స్ వంటి నిర్దిష్ట పరిమితిని కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా పరీక్ష దశలోనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. పరీక్షలు విజయవంతంగా పూర్తయిన తర్వాత, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులందరికీ అందుబాటులోకి రావచ్చు. ముఖ్యంగా డేటా కనెక్టివిటీ సమస్యలున్న మన దేశం వంటి ప్రాంతాల్లో రీల్స్ అభిమానులకు ఇది గొప్ప వరం కానుంది. డౌన్‌లోడ్ చేసుకున్న ఈ వీడియోలను ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పుడు సాధారణ ఫీడ్‌లో చూడవచ్చు లేదా ప్రత్యేకంగా కేటాయించిన 'డౌన్‌లోడ్స్' సెక్షన్ ద్వారా వీక్షించవచ్చు. యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఇప్పటికే ఉన్న 'స్మార్ట్ డౌన్‌లోడ్స్' ఫీచర్‌కు ఇది చాలా పోలి ఉంటుంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న 'హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు-2026' వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేసేలా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. సామాజిక సామరస్యం పేరుతో తెస్తున్న ఈ బిల్లు అత్యంత కఠినంగా, అస్పష్టంగా ఉందని, ఇది ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేందుకు ఇప్పటికే దేశంలో తగిన చట్టాలు ఉన్నాయని, వాటిని పటిష్టంగా అమలు చేయాల్సింది పోయి, ఇలాంటి సమాంతర వ్యవస్థను తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వ విచక్షణకు విపరీతమైన అధికారాలు కట్టబెట్టే ఈ 'డ్రాకోనియన్' బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త సర్టిఫికేషన్ నిబంధనల ప్రకారం ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే చైనా కంపెనీల నిఘా పరికరాల అమ్మకాలను భారత్‌లో నిలిపివేయనున్నారు. ముఖ్యంగా ‘స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్’ అనుమతి ఉన్న కెమెరాలను మాత్రమే ఇకపై దేశంలో విక్రయించాల్సి ఉంటుంది. నిఘా పరికరాలు అత్యంత సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తాయి. విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలు, రవాణా కేంద్రాలు వంటి కీలక ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తారు. ఈ క్రమంలో చైనా కెమెరాల ద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని భారత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కెమెరాల్లో రహస్యంగా ‘బ్యాక్ డోర్’ యాక్సెస్ ఉండే అవకాశం ఉందని, దీని ద్వారా సేకరించిన సమాచారం విదేశీ సర్వర్‌లకు చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్షణ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో చైనా కెమెరాలను వాడటం వల్ల మన వ్యూహాత్మక సమాచారం బయటకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సర్వైలెన్స్ మార్కెట్‌లలో ఒకటి. తాజా నిర్ణయం వల్ల చైనా కంపెనీలకు గట్టి దెబ్బ తగిలే అవకాశం ఉండగా, భారతీయ తయారీదారులకు ఇది పెద్ద అవకాశంగా మారనుంది. తద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరగనుంది. 

దేశంలో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తాత్కాలికంగా కిరోసిన్ సరఫరాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 29న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ద్వారా 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో సార్వజనిక పంపిణీ వ్యవస్థ కింద 'సుపీరియర్ కిరోసిన్ ఆయిల్'ను 60 రోజుల పాటు సరఫరా చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇంధన కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించడమే ఈ నిర్ణయం యొక్క ఉద్దేశ్యం. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు చెందిన కొన్ని ఎంపిక చేసిన పెట్రోల్ బంకులకు కిరోసిన్ నిల్వ మరియు విక్రయాలకు అనుమతి ఇచ్చారు. దీని ప్రకారం ప్రతి బంకు గరిష్టంగా 5,000 లీటర్ల కిరోసిన్‌ను నిల్వ ఉంచవచ్చు. ప్రతి జిల్లాలో గరిష్టంగా రెండు బంకులకు మాత్రమే ఈ బాధ్యత అప్పగిస్తారు. దీనిని కేవలం వంట మరియు వెలుతురు వంటి గృహ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సరఫరాను వేగవంతం చేయడానికి పెట్రోలియం నిబంధనలు-2002లోని కొన్ని లైసెన్సింగ్ నిబంధనల నుండి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. అయితే, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పీఈఎస్ఓ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన మరియు సౌభాగ్య పథకం ద్వారా ఇంటింటికీ గ్యాస్ మరియు విద్యుత్తును అందించడం వల్ల, గత కొన్నేళ్లుగా కిరోసిన్ వాడకాన్ని తగ్గించారు. చాలా రాష్ట్రాలు తమను తాము "కిరోసిన్ రహిత" రాష్ట్రాలుగా ప్రకటించుకున్నాయి. కానీ ప్రస్తుత యుద్ధం కారణంగా ఏర్పడిన అనిశ్చితి వల్ల ప్రభుత్వం మళ్లీ పాత పద్ధతికి వెళ్లాల్సి వచ్చింది.

వేదాంత గ్రూపులో భారీ డీమెర్జర్ ప్రక్రియను కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ధృవీకరించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రక్రియ ద్వారా వేదాంత లిమిటెడ్ ఐదు కొత్త స్వతంత్ర కంపెనీలుగా విడిపోనుందని తెలిపారు. నిజానికి ఈ డీమెర్జర్ ప్రక్రియ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోను భారీగా పెంచనుంది. వేదాంత లిమిటెడ్‌కు చెందిన ఒక్క షేరు ఉంటే, డీమెర్జర్ పూర్తయిన తర్వాత అవి మొత్తం 6 షేర్లు అవుతాయి. వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ & గ్యాస్,వేదాంత స్టీల్ & ఫెర్రస్, వేదాంత బేస్ మెటల్స్, వేదాంత పవర్ గా విడగొడుతున్నట్లు అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ ఐదు కంపెనీలకు మాతృ సంస్థ అయిన వేదాంత లిమిటెడ్ ఇకపై కేవలం పెట్టుబడులు, సెమీకండక్టర్ల వంటి భవిష్యత్ టెక్నాలజీ ప్రాజెక్టులపై మాత్రమే దృష్టి సారిస్తుందని తెలిపారు. వేదాంత ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2025 డిసెంబర్ నాటికి కంపెనీపై రూ.60,624 కోట్ల అప్పు ఉంది. రాబోయే మూడేళ్లలో సుమారు $3 బిలియన్ల రుణాన్ని తగ్గించుకోవాలని అనిల్ అగర్వాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. విడిపోయిన కంపెనీలలో వాటాలను విక్రయించడం ద్వారా ఈ అప్పు తీర్చడం సులభమవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఉన్న $27 బిలియన్ల మార్కెట్ క్యాప్, ఐదు కంపెనీలు విడిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువ విలువను సంతరించుకుంటుందని కంపెనీ ఆశిస్తోంది. ఇప్పటివరకు ఆయిల్, గ్యాస్, పవర్ వంటి అన్ని వ్యాపారాలన్నీ ఒకే గొడుగు కింద ఉండేవి. ఇకపై ఇన్వెస్టర్లు తమకు నచ్చిన రంగంలో (ఉదాహరణకు కేవలం పవర్ లేదా ఆయిల్ రంగంలో మాత్రమే) పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తుంది. ప్రతి కంపెనీకి ప్రత్యేక బోర్డ్, యాజమాన్యం ఉండటం వల్ల నిర్ణయాలు వేగంగా జరిగి లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ వేదాంత ఇన్వెస్టర్లకు ఒక లాటరీ వంటిదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. 

వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేసిన 'వి ఆర్ సిటీ 2026' నివేదికలో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో నిలవడం విశేషం. అందమైన చారిత్రక కట్టడాలు, నోరూరించే బిర్యానీ, ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలు ఇవన్నీ ఒకెత్తయితే, సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు అందరికీ హాయిగా నివసించే అవకాశాన్ని కల్పించడంలో హైదరాబాద్‌కు సాటిలేదని మరోసారి రుజువైంది. అంతర్జాతీయ సంస్థ వరల్డ్ ఎకనామిక్ ఫోరం తాజాగా ప్రకటించిన 'వి ఆర్ సిటీ 2026' నివేదికలో, దేశంలోని అన్ని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి హైదరాబాద్ నెంబర్ 1 ర్యాంకును కైవసం చేసుకుంది. హైదరాబాద్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధానంగా మూడు అంశాలు దోహదపడ్డాయి. మెట్రో రైలు విస్తరణ, ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, మెరుగైన రహదారులతో మౌలిక సదుపాయాల్లో నగరం దూసుకుపోతోంది. ముంబై, ఢిల్లీ లేదా బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్‌లో నిత్యావసరాలు, అద్దెలు ,రవాణా ఖర్చులు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయి. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే ఐటీ రంగం ఉన్నప్పటికీ, ఇక్కడి వాతావరణం, వినోద సౌకర్యాలు , ప్రజల జీవనశైలి మానసిక ప్రశాంతతను అందిస్తున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నివేదిక ప్రకారం వివిధ విభాగాల్లో నగరాల పనితీరు ఇలా ఉంది. పట్టికను గమనిస్తే, హైదరాబాద్ వాతావరణం (ర్యాంక్ 2) ,వైవిధ్యం (ర్యాంక్ 3) విభాగాల్లో అద్భుతమైన స్కోరు సాధించింది. బెంగళూరు మౌలిక సదుపాయాల్లో (ర్యాంక్ 1) ఉన్నప్పటికీ, రవాణా కష్టాల (ర్యాంక్ 8) వల్ల వెనకబడింది. ఢిల్లీ రవాణాలో (ర్యాంక్ 1) టాప్‌లో ఉన్నా, ఓవరాల్‌గా ఐదో స్థానానికే పరిమితమైంది. కానీ హైదరాబాద్ అన్ని విభాగాల్లోనూ స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ ఓవరాల్ నంబర్ 1 గా నిలిచింది. ఈ నివేదిక కేవలం గణాంకాలు మాత్రమే కాదు, ప్రతి హైదరాబాద్ నివాసి గర్వపడాల్సిన విషయం. మల్టీ నేషనల్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగి నుంచి, కూలీ పనులు చేసుకునే వ్యక్తి వరకు ప్రతి ఒక్కరికీ ఈ నగరం భరోసానిస్తోంది. సురక్షితమైన వాతావరణం, గంగా-జమునా తెహజీబ్ (మత సామరస్యం) వంటి అంశాలు ఈ నగరానికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి. నివసించడానికి అనువైన నగరం అంటే కేవలం పెద్ద భవనాలు ఉండటం కాదు.. అక్కడి మనుషుల మనసులు, తక్కువ ఖర్చుతో కూడిన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం. ఈ మూడింటి కలయికే నేటి హైదరాబాద్. అందుకే 2026లో దేశంలోనే అత్యుత్తమ నగరంగా నిలిచి చరిత్ర సృష్టించింది.

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో కేటీఆర్ సహా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డుపెట్టుకుని భూములు గుంజుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. భూమి బౌండరీలను మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని తెలిపారు. అధికారులను అడ్డుపెట్టుకుని అరాచకపర్వం చేపడుతున్నారని మండిపడ్డారు. కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూ కబ్జా బాధితులను పరామర్శించారు. భూ కబ్జాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాడుతుందని బాధితులకు భరోసానిచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వట్టనాగులపల్లిలో సతీశ్ షా కుటుంబం 60 ఏళ్లుగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రూ.1400 కోట్ల విలువ చేసే భూమిపై పొంగులేటి కన్ను పడిందని పేర్కొన్నారు. స్థలం ఇచ్చే ఉద్దేశం లేదని షా కుటుంబం తెలిపిందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో మీ ల్యాండ్ పోయిందని బెదిరింపులకు గురి చేశారని చెప్పారు. ఓ అక్రమార్కున్ని అడ్డం పెట్టుకుని 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జేసీబీలతో వచ్చి గోశాలను కూల్చేశారనికాంపౌండ్ వాల్ కూలగొట్టారని అన్నారు. సతీశ్ షాను ఇక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించారని తెలిపారు. అజీబుల్లా ఖాన్ అనే సిన్సియర్ అధికారి వీరికి రక్షణ కల్పించారని పేర్కొన్నారు. తెల్లారే ఆ నిజాయితీ పోలీసు అధికారిని ట్రాన్స్‌ఫర్ చేశారని చెప్పారు.

తెలంగాణ శాసనమండలి నుంచి మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, తాతా మధు సహా బీఆర్‌ఎస్ సభ్యులను చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినప్పటికీ బీఆర్‌ఎస్ సభ్యులు సభలోనే ఉండి నిరసనకు దిగారు. సీట్లపైకి ఎక్కి మరీ నిరసన తెలపడంతో వారిని మార్షల్స్‌ అడ్డుకున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ సభ్యులను బయటకు పంపాలని మార్షల్స్‌కు చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మార్షల్స్‌, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. 'గెటవుట్' అంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'మీలాంటి వారు సభకు రావడం సరికాదు. పెద్దల సభ గౌరవం కాపాడాలి' అని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

టాప్ ప్రోగ్రామర్లు ఇప్పుడు స్వయంగా కోడింగ్ రాయడం మానేశారని గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ కిడ్మత్ తెలిపారు. దానికి బదులుగా వారు కేవలం ఇన్స్ స్ట్రక్షన్స్ ఇస్తూ, ఫలితాలను సరిచూసే 'టెస్ట్ ఫంక్షన్స్' రాస్తున్నారు. మిగతా పనినంతా కృత్రిమ మేధ చూసుకుంటోంది. తన స్టార్టప్‌లోని ఒక ప్రోగ్రామర్ చేసే పనిని ఆయన ప్రస్తావించారు. ఆ ప్రోగ్రామర్ సాయంత్రం ఏఐకి పని అప్పజెప్పి నిద్రపోతే, తెల్లవారుజామున 4 గంటలకల్లా ప్రాజెక్ట్ పూర్తవుతోంది. ఇదే పనిని గూగుల్‌లో చేయాలంటే 10 మంది ప్రోగ్రామర్లు, ఆరు నెలల సమయం పట్టేది' అని ఆయన పేర్కొన్నారు. ఏఐ వల్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల ప్రాముఖ్యత తగ్గుతుందని భావిస్తున్న వారికి ఎరిక్ ఒక కొత్త కోణాన్ని చూపారు. నైపుణ్యం కలిగిన ఇంజనీర్లకు డిమాండ్ తగ్గకపోగా, మరింత పెరుగుతుందన్నారు. ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారే భవిష్యత్తులో కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారని చెప్పారు. కేవలం ప్రోగ్రామింగ్ మాత్రమే కాదు, అకౌంటింగ్, బిల్లింగ్, లాజిస్టిక్స్ తదితర ఖర్చుతో కూడిన వ్యాపార కార్యకలాపాలను కూడా ఏఐ సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు.

3