జెబెల్ ఇరాక్ బంగారు గని వద్ద సాయుధ దుండగులు దాడి : 70 మందికి పైగా పౌరులు కాల్చివేత


క్షిణ సూడాన్ రాజధాని జుబాకు సమీపంలోని జెబెల్ ఇరాక్ బంగారు గని వద్ద గుర్తు తెలియని సాయుధ దుండగులు జరిపిన మారణహోమంలో 70 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గని వద్ద తలెత్తిన వివాదమే ఈ ఘోరానికి కారణం కాగా, మృతుల సంఖ్య 85 వరకు ఉండవచ్చని అనధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. దుండగులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అనేకమంది తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. 2018 శాంతి ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, అక్రమ గనుల తవ్వకాలు మరియు సాయుధ గ్రూపుల ఆధిపత్య పోరు కారణంగా ఆ ప్రాంతంలో హింస రాజ్యమేలుతోంది. ఈ దారుణ ఘటనపై దక్షిణ సూడాన్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయనప్పటికీ, మైనింగ్ మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అంతర్జాతీయ సమాజం ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం