Ad Code

12 టన్నుల కిట్‌క్యాట్ చాక్లెట్లతో వెళ్తున్న భారీ ట్రక్కు అదృశ్యం


యూరప్‌లో సుమారు 12 టన్నుల బరువున్న కిట్‌క్యాట్ చాక్లెట్ల లోడ్‌తో వెళ్తున్న ఒక భారీ ట్రక్కు అదృశ్యమైంది. ఈ దొంగతనం కారణంగా రాబోయే ఈస్టర్ పండుగ సమయంలో మార్కెట్లో కిట్‌క్యాట్ కొరత ఏర్పడే అవకాశం ఉందని కంపెనీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నెస్లే కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 4,13,793 యూనిట్ల కిట్‌క్యాట్ చాక్లెట్లతో నిండిన ఒక ట్రక్కు రవాణాలో ఉండగా అదృశ్యమైంది. ఈ మొత్తం చాక్లెట్ల బరువు దాదాపు 12 టన్నులు. ఈ ట్రక్కు ప్రొడక్షన్ యూనిట్ నుండి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు వెళ్తుండగా దారిలోనే మాయమైపోయింది.

Post a Comment

0 Comments

Close Menu