విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం : ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర పరిస్థితి విధింపు


విశాఖపట్నం నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. ఇంజిన్ లో అవాంఛనీయ శబ్దాలు వినిపించాయి. దీంతో పైలెట్లు అప్రమత్తం అయ్యారు. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బందికి తక్షణ సమాచారాన్ని అందజేశారు. దీంతో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర పరిస్థితిని విధించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంబులెన్స్ లు, ఇతర వైద్య సహాయాన్ని అందుబాటులో ఉంచారు.

Post a Comment

0 Comments