పాకిస్తాన్ లో గ్యాస్‌ను అక్రమంగా నిల్వ చేయడం, దొంగిలించడాన్ని తీవ్రవాదంగా వర్గీకరిస్తూ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ఒక బిల్లును సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే, పాకిస్తాన్లో చమురు, గ్యాస్‌లను నిల్వ చేయడం, అక్రమంగా రవాణా చేయడం, చట్టవిరుద్ధంగా భద్రపరచడం నేరంగా పరిగణిస్తారు. ప్రభుత్వం కోరుకుంటే, ఇందులో ప్రమేయం ఉన్న వ్యక్తిపై తీవ్రవాద చట్టాన్ని కూడా విధించవచ్చు. డాన్ వార్తాపత్రిక కథనం ప్రకారం, పాకిస్తానీ ప్రభుత్వం పార్లమెంటులో క్రిమినల్ లా (సవరణ) బిల్లు - 2026ను ప్రవేశపెట్టింది. చమురు, గ్యాస్ సంక్షోభానికి ప్రతిస్పందనగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు. మాఫియా కుమ్మక్కుతో చమురు సంస్థలపై దాడులు జరుగుతున్నాయని, ఆ తర్వాత చమురును నిల్వ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈమేరకు పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి అజం నజీర్ తారర్ ఈ బిల్లును ప్రవేశపెట్టిన తెలుస్తోంది. ఉగ్రవాదులు మొదట పైప్లైన్లను ధ్వంసం చేసి, ఆ తర్వాత మాఫియాల ద్వారా చమురు, గ్యాస్‌లను అమ్ముతున్నారని పాకిస్తానీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ డబ్బును పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి ఉపయోగిస్తున్నారు. అందుకే పాకిస్తానీ ప్రభుత్వం చమురు, గ్యాస్‌కు సంబంధించి కఠినమైన చట్టాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు డాన్ పత్రిక పేర్కొంది. ఇదిలావుంటే, సోమవారం, బలూచిస్థాన్‌లోని ఒక చమురు పైప్‌లైన్‌పై దాడి జరిగినట్లు వచ్చాయి. దీనివల్ల బలూచ్ రాజధాని క్వెట్టాతో సహా పలు ప్రాంతాలకు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ దాడులను ఎవరు, ఎందుకు చేశారనే దానిపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం అందించలేదు.
గ్యాస్‌ను అక్రమంగా నిల్వ చేయడం, దొంగిలించడాన్ని తీవ్రవాదంగా పరిగణిస్తూ బిల్లు ప్రవేశపెట్టిన పాకిస్తాన్ ప్రభుత్వం
by Telugu Lo Computer at March 31, 2026
Labels:
2026
,
abled the Criminal Law (Amendment) Bill
,
Dawn newspaper
,
Government Introduces Bill in Pakistan Classifying Illegal Stockpiling and Theft of Gas as Terrorism
,
international
About Telugu Lo Computer
This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.
Related Posts
Subscribe to:
Post Comments
(
Atom
)
3


No comments:
Post a Comment