Ad Code

అస్సాంలో ఐదు గ్యారెంటీలు ప్రకటించిన మల్లికార్జున ఖర్గే


స్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలవారీ నగదు బదిలీతో పాటు, వారు వ్యాపారం చేసుకునేందుకు, వ్యాపార విస్తరణకు అదనంగా రూ.50,000 సాయం చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. మహిళలకు నగదు బదిలీతో సహా ఐదు హామీలను ఆయన ప్రకటించారు. లఖింపూర్ జిల్లా నౌబోయిచాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఖర్గే పాల్గొన్నారు. మహిళా సంక్షేమంపై దృష్టిపెడతామని, అందరికీ ఆరోగ్య సంరక్షణ, భూమి హక్కులు కల్పించడం, జుబీన్ గార్గ్ మృతి కేసులో న్యాయం చేయడం వంటివి పార్టీ ప్రధాన హామీలుగా ఖర్గే చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని కుటుంబాలకు రూ.25 లక్షల క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని, 10 లక్షల మంది మూలవాసులకు శాశ్వత భూమి పట్టాలు ఇస్తామని, రాష్ట్రంలోని సీనియర్ సిటిజన్లకు రూ.1,250 చొప్పున నెలవారీ పెన్షన్లు ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జుబీన్ గార్గ్ మృతి కేసులో న్యాయం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఖర్గే విమర్శలు గుప్పించారు. బీజేపీ డబుల్ ఇంజన్‌తో అస్సాంను లూటీ చేసి, తమ నాయకులు, కుటుంబాల ఖజానాలు నింపుతోందన్నారు. హిమంత్ బిశ్వా శర్మను నకిలీ సీఎంగా ఆయన పేర్కొన్నారు. సర్బానంద్ సోనోవాల్ నాయకత్వంలో బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిందని, అయితే గిరిజనుడైన సోనోవాల్‌ను తొలగించి సీఎం పదవిని శర్మ చేపట్టారని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu