Ad Code

ఏ జీవి కూడా ధర్మానికి అతీతంగా మనుగడ సాగించలేదు : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్


ముంబైలో నిర్వహించిన 'విహార్ సేవక్ ఉర్జా మిలన్' కార్యక్రమంలో పాల్గొన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ధర్మం గురించి ఉపన్యసిస్తూ ధర్మం అనే సూత్రం ప్రపంచాన్ని నడిపిస్తోంది. ధర్మం పైనే ప్రతి విషయం ఆధారపడి ఉంది. ఆ ఆధ్యాత్మిక వారసత్వం పూర్వీకుల నుంచి మనకు లభించింది. మతాన్ని ఆచరిస్తూ సత్యానికి కట్టుబడి ఉండే సాధువుల సూచనలను మన దేశం పాటిస్తోంది. భారతదేశం విశ్వగురువుగా ఎదిగేందుకు ధర్మాన్ని ఆశ్రయించాలి. మన ఆధ్యాత్మిక పరిజ్ఞానం ప్రపంచానికి చాలా అవసరం' అని పేర్కొన్నారు  ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మనందరినీ ధర్మం అనే చోదక శక్తి నడిపిస్తోందని, ధర్మం అనే వాహనంలో ప్రయాణిస్తే ప్రమాదాలు ఎన్నటికీ జరగవని మోహన్ భగవత్ అన్నారు. ఏ జీవి కూడా ధర్మానికి అతీతంగా మనుగడ సాగించలేదని అభిప్రాయపడ్డారు. 

Post a Comment

0 Comments

Close Menu