Ad Code

ప్రాణాలను బలిగొన్న రూ.22 బాకీ !


తెలంగాణలోని మెదక్ జిల్లా చేగుంట మండలం అనంతసాగర్ లో  రూ.22 బాకీ ఒకరి ప్రాణాలను బలిగొంది.  పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహ్మద్ సిరాజ్, మహేశ్ కుమార్ వర్మ జీవనోపాధి కోసం అనంతసాగర్‌లో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో సిరాజ్ ఇవ్వాల్సిన రూ.22 బాకీని మహేశ్ ప్రస్తావించడంతో మాటల తూటాలు తారాస్థాయికి చేరాయి. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన మహేశ్ తీవ్ర కోపానికి లోనయ్యాడు. వాగ్వాదం కాస్తా హింసగా మారడంతో మహేశ్ సిరాజ్‌పై దాడి చేశాడు. సమీపంలోని చెట్టుకు సిరాజ్ తలను బలంగా కొట్టి, అనంతరం అక్కడే ఉన్న బండరాయితో తలపై మోదాడు. ఈ దాడిలో సిరాజ్‌కు తీవ్ర గాయాలు కాగా, అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న చేగుంట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు మహేశ్ కుమార్ వర్మ తన నేరాన్ని అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu