Ad Code

మరోసారి తాజ్ మహల్ భద్రత విఫలం ?


తాజ్ మహల్ భద్రత మరోసారి విఫలమైంది. గంగాజలం అందించే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. సోమవారం తాజ్ కాంప్లెక్స్‌లో ఓ మహిళ గంగాజలాన్ని సమర్పించి, శివుడి ఫోటోతో కూడిన జెండాను కూడా ఎగురవేసింది. వెంటనే ఈ విషయం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న సీఐఎస్ఎఫ్ జవాన్లు మహిళను పట్టుకున్నారు. కాగా ఆ మహిళ జెండా ఎగురవేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి హిందూ మహాసభ నాయకురాలు మీరా రాథోడ్ వాటర్ బాటిల్‌లో గంగాజలాన్ని తీసుకెళ్లి సమర్పించి.. అక్కడ శివుని జెండాను ఎగురవేశారు. ఘటనా స్థలంలో మోహరించిన సీఐఎస్‌ఎఫ్ మహిళా జవాన్లు మీరా రాథోడ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ముందు కూడా ఈ మహిళ తాజ్ మహల్ వద్ద జలాభిషేకం చేయడానికి కన్వర్‌తో వచ్చింది. శనివారం ఉదయం హిందూ మహాసభ మధుర జిల్లా అధ్యక్షుడు వినేష్ చౌదరి, శ్యామ్‌లు తాజ్‌మహల్‌కు చేరుకుని షాజహాన్, ముంతాజ్ సమాధులపై గంగాజలం సమర్పించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న సీఐఎస్ఎఫ్ జవాన్లు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిని తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిందూ మహాసభ మధుర జిల్లా అధ్యక్షుడు వినేష్ చౌదరి, శ్యామ్‌లు తాజ్‌మహల్‌లోకి ప్రవేశించేందుకు ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఆ తర్వాత పడమటి ద్వారం గుండా లోపలికి వెళ్లారు. యువకులిద్దరూ వాటర్ బాటిళ్లలో గంగా జలం తీసుకెళ్లారు. సమాధి దగ్గరకు రాగానే బాటిల్ లోని గంగా జలాన్ని సమాధులపై పోశారు. అది చూసిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu