బెంగళూరులో వడ్డించిన భోజనం విషయంలో తలెత్తిన చిన్న వివాదం, చివరకు ఒక కుటుంబాన్ని తీరని శోకంలో ముంచేసింది. కావ్య తన భర్తకు సాంబార్ వేడి చేసి భోజనం వడ్డించింది. అయితే, ఆ సాంబారు మూడు రోజుల క్రితం చేసినదని గుర్తించిన రంగస్వామి ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యాడు. "చద్ది సాంబార్‌ను ఎందుకు వడ్డించావు?" అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. భర్త అందరి ముందు తనను మందలించడంతో కావ్య తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ ఆవేదనలో ఇంట్లోనే ఉన్న పురుగుల మందును తాగింది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం లేకపోయింది. ఆసుపత్రికి చేరుకునే మార్గమధ్యలోనే కావ్య ప్రాణాలు విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
0 Comments