Posts

Showing posts with the label 'ఈ-పోస్ట్‌'తో శుభాకాంక్షలు తెలిపేలా తపాలా శాఖ ఏర్పాటు

'ఈ-పోస్ట్‌'తో శుభాకాంక్షలు తెలిపేలా తపాలా శాఖ ఏర్పాటు !

Image
సా ర్వత్రిక ఎన్నికల విజేతల్ని అభినందించేందుకు ఈ-పోస్ట్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపేలా ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ అవకాశం కల్పిస్తోంది. కేవలం రూ.10తో ఈ-పోస్ట్ ద్వారా శుభాకాంక్షల్ని ఏ పోస్టాఫీసు నుంచైనా పంపించవచ్చని విశాఖ పోస్టల్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ తెలిపారు. ప్రజలు తమ ప్రియతమ నేతకు శుభాభినందనలతో సందేశం పంపేందుకు ఈ సేవల్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ-పోస్ట్‌ ద్వారా ఎలక్ట్రానిక్‌ పోస్టాఫీస్‌లో బుక్‌ చేసుకున్న సందేశం సంబంధిత నేతల చిరునామాకు ఫిజికల్‌ డెలివరీ ద్వారా బట్వాడా చేయనున్నట్లు తెలిపారు.