Posts

Showing posts with the label 000 Fine on HYDRA Commissioner Ranganath

హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాథ్ కు రూ.50వేల జరిమానా విధించిన హైకోర్టు

Image
హై దరాబాద్‌లో చెరువుల సంరక్షణ మరియు అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటున్న హైడ్రా అధికారులకు తాజాగా తెలంగాణ హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెంగళరావునగర్‌లోని సర్వే నంబర్ 45లో ఉన్న రెండెకరాల వివాదాస్పద భూమి వ్యవహారంలో కోర్టు ఆదేశాలను సకాలంలో అమలు చేయకపోవడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ప్రధాన న్యాయమూర్తి సహాయ నిధికి చెల్లించిన తర్వాత మాత్రమే కౌంటర్ అఫిడవిట్లను స్వీకరించాలని రిజిస్ట్రీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ నేతృత్వంలోని బెంచ్ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. కోర్టు ఇచ్చిన గడువులను హైడ్రా అధికారులు నిర్లక్ష్యం చేయడం, సకాలంలో సరైన కౌంటర్లు దాఖలు చేయకపోవడంపై న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.