Posts

Showing posts with the label 22 Killed as Crane Falls on Train in Thailand

థాయిలాండ్‌ లో రైలుపై క్రేన్‌ పడి 22 మంది మృతి

Image
థా యిలాండ్‌ ఎలివేటెడ్ హై-స్పీడ్ రైల్వే ప్రాజెక్టులో పనిచేస్తున్న నిర్మాణ క్రేన్ కదులుతున్న ప్యాసింజర్ రైలుపై కూలిపోవడంతో 22 మంది మరణించారు. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, రైలు బ్యాంకాక్ నుండి ఉబోన్ రాట్చథాని ప్రావిన్స్‌కు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. క్రేన్ జారీ ప్రయాణిస్తున్న రైలుపై పడిపోవడంతో బోగీలు పట్టాలు తప్పి బోల్తా కొట్టాయి. దీంతో మంటలు చెలరేగి పెద్ద ప్రమాదానికి దారితీసింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనాస్థలం నుంచి నాలుగు మృతదేహాలను బయటకు తీశారు. రైలు లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అత్యవసర సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బందిని పెద్ద సంఖ్యలో మోహరించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు త్వరలో ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.