భూమిపై కూలనున్న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ !
యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఐదేళ్ల క్రితం ప్రయోగించిన ఏయోలస్ అనే భారీ ఉపగ్రహం త్వరలో భూమిపై కూలబోతున్నది. 1360 కిలోల బరువైన ఈ శాటిలైట్ జీవిత కాలం చివరి అంకానికి చేరుకోవడంతో రీఎంట్రీకి ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రస్తుతం భూమికి 320 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఉపగ్రహం.. సూర్యుడి నుంచి వస్తున్న ప్లాస్మా గాలుల కారణంగా త్వరగా ఇంధనాన్ని కోల్పోతున్నది. దీంతో ప్రస్తుతం శాటిలైట్‌లో ఫ్యూయల్ కెపాసిటీ దాదాపు తగ్గిపోయింది. ఒక వైపు ఇంధనం అయిపోతుండటంతో రీఎంట్రీకి చేయాల్సిన దశలను శాస్త్రవేత్తలు మొదలు పెట్టారు. ప్రస్తుతం ఈ ఉపగ్రహంలోని లేజర్ పరికరాలు ఇంకా పని చేస్తున్నాయి. దీంతో శాటిలైట్‌లో ఇతర పరికరాలను ఏప్రిల్ 30నే నిలిపివేశారు. దానికి సంబంధించిన డేటాను పూర్తిగా సేకరించే పనిలో శాస్త్రవేత్తలు ప్రారంభించారు. ఇలా చేయడం వల్ల ఎయోలస్-2 ప్రయోగ సమయంలో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాబోయే కొన్ని రోజుల్లో ఎయోలస్ తనంతట తానుగా 320 కిలోమీటర్ల ఎత్తు నుంచి 280 కిలోమీటర్ల ఎత్తుకు దిగనున్నది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు శాటిలైట్‌లోని పరికరాలను ఉపయోగించి 150 కిలోమీటర్లు ఎత్తుకు దాన్ని దించుతార...