మార్కెట్లోకి E85 పెట్రోల్
కేంద్ర ప్రభుత్వం పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పెట్రోల్ బిల్లుల భారాన్ని దించుకోవడానికి ఇథనాల్ బ్లెండింగ్ భారీగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే కొద్ది రోజుల కిందట 'E85' అంటే 85% ఇథనాల్ + 15% పెట్రోల్ ఉన్న ఇంధనాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతానికి మన మార్కెట్లో ఈ సరికొత్త E85 ఫ్యూయల్‌ను సపోర్ట్ చేసే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు కేవలం మూడే అందుబాటులో ఉన్నాయి. మొట్టమొదటి మాస్-మార్కెట్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ప్యాసింజర్ కారుగా మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ కారును E20 నుంచి ఏకంగా E100 అంటే100% ఇథనాల్ పైన నడిచేలా ఇంజనీర్లు డిజైన్ చేశారు. అయితే ప్రస్తుత భారతీయ నిబంధనల ప్రకారం ఇది E85 ఫ్యూయల్‌తో హోమోలోగేట్ చేయబడింది. మారుతున్న ఇథనాల్ శాతానికి అనుగుణంగా ఇంజన్ ట్యూన్ అవ్వడానికి ఇందులో అడ్వాన్స్‌డ్ ఈసీయూ కాలిబ్రేషన్‌ను ఉపయోగించారు. ఎలక్ట్రిక్, హైబ్రిడ్, సీఎన్‌జీలతో పాటు ఇథనాల్ టెక్నాలజీని కూడా సామాన్యుడికి అందుబాటులోకి తేవాలనే ప్లాన్‌లో మారుతి ఉంది. కాకపోతే ఈ కారు పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. హీరో స్ప్లెండర్ సర...