February 2023
స్మార్ట్ ఫోన్ ఓ నిత్యావసరం వస్తువైంది. బహుళ ప్రయోజనాలను కలిగి ఉంటోంది. దీంతో దానికి ప్రాధాన్యత పెరిగింది. మార్కెట్లో వందల కొద్దీ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 15,000 నుంచి రూ. 20,000 లోపు బడ్జెట్ లో మంచి స్మార్ట్ ఫోన్లు :
రియల్ మీ 10 ప్రో 5జీ అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 120హెచ్‌జెడ్ బౌండ్లెస్ డిస్ప్లే ఉంటుంది. ఇది స్నాప్‌డ్రాగన్ 695 5G చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. 16ఎంపీసెల్ఫీ కెమెరాతో 108ఎంపీ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఇది నెబ్యులా బ్లూ, హైపర్‌స్పేస్ గోల్డ్, డార్క్ మేటర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. 6జీబీ+128జీబీ ధర రూ. 18,999 8జీబీ+ 128జీబీ ధర రూ.19,999. రియల్ మీ అధికారిక వైబ్ సైట్ తో పాటు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.
పొకో ఎక్స్4 ప్రో ఫోన్ డిస్ప్లే క్వాలిటీ, డిజైన్ చాలా బాగుంటాయి. బ్యాక్ ప్యానెల్ పూర్తిగా గ్లాస్‌తో కవర్ చేసి ఉంటుంది. గత ఏప్రిల్ ఐదో తేదీన ఈ ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించారు. పొకో ఎక్స్4 ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. దీని డిస్ప్లే 6.67 అంగుళాలు ఉంటుంది. 64 ఎంపీ, 8ఎంపీ, 2 ఎంపీ సామర్థ్యం గల మూడు కెమెరాలు ఫోన్ బ్యాక్‌లోనూ, 16 మెగా పిక్సెల్‌తో ఫ్రంట్‌లో మరో కెమెరా ఉంటుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. దీని ధర రూ.16,999. అలాగే 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రరూ. 18,999ల కు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ నొర్డ్ సీఈ 2 లైట్ 5జీ రూ.20 వేల లోపు క్యాటగిరీలో వన్‌ప్లస్ తీసుకొస్తున్న తొలి స్మార్ట్ ఫోన్. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమరా, రెండు 2-ఎంపీ సెన్సర్ కెమెరాలు ఉంటాయి. ఇన్‌ఫ్రంట్‌లో 16 మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, ఓక్టాకోర్ సీపీయూ (2.2గిగా హెర్ట్జ్, డ్యుయల్ కోర్), 5000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనికి 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ చార్జర్ లభిస్తుంది. 6జీబీ /128జీబీ, 8జీబీ/128జీబీ వేరియంట్లలో లభించే ఈ ఫోన్ ధరలు రూ.18999, రూ. 20,999. వన్ ప్లస్ అధికారిక వెబ్ సైట్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది.
రెడ్ మీ నోట్ 12 5జీ 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో వస్తుంది. దీనిలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 చిప్ సెట్ తో వస్తుంది. 6.67 ఫుల్ హెచ్ డీ, సూపర్ అమోల్డ్ డిస్ ప్లే తో వస్తోంది. 48ఎంపీ ప్రధాన కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. ఇది ఫ్రాస్టెడ్ గ్రీన్, మ్యాట్ బ్లాక్, మిస్టిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తోంది. రెండు స్టోరేజ్ వేరియంట్లలో రెడ్ మీ అధికారిక వెబ్ సైట్ తో పాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉంది. 4జీబీ+128జీబీ ధర రూ.17,999, 6జీబీ+128జీబీ ధర రూ.19,999 గా ఉంది.

ఇప్పటికే కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల్ని తొలగించిన గూగుల్, తాజాగా క్లౌడ్ ఉద్యోగులు వారి సహచర ఉద్యోగులు డెస్క్‌లు వినియోగించుకోవాలని కోరింది. తద్వారా నిర్వహణ ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తోంది. 'రియల్ ఎస్టేట్ ఎఫిషెన్సీ' (హాల్ తరహాలో డెస్క్‌లు) పేరుతో గూగుల్ ఆఫీస్‌లో డెస్క్‌ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు శ్రీకారం చుట్టుంది. ప్రస్తుతం ఉద్యోగులు హైబ్రిడ్ వర్కింగ్ విధానంలో వారంలో 2 రోజులు ఇంటిలో, 3 రోజులు ఆఫీసులో పనిచేస్తున్నారు. వారంతంలో శని, ఆదివారాలు సెలవులే. ఇప్పుడు ఈ విధానంలో గూగుల్ మార్పులు చేస్తుంది. ఉద్యోగులు పరస్పర అంగీకారంతో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆఫీస్‌లో వర్క్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని తెలిపింది. తదనుగుణంగా కార్యాలయాల్లో డెస్క్‌లను సిద్ధం చేస్తున్నట్లు ఇంటర్నల్ మీటింగ్‌లో పేర్కొంది. ఇప్పుడు ఉద్యోగులకు విడివిడిగా డెస్క్‌లు లేవని, ఒకరి డెస్క్‌లు మరొకరు వాడుకోవాలని సూచించింది. అయితే, డెస్క్ అందుబాటులో లేనప్పుడు ఉద్యోగులు ఆఫీస్‌కు రావొచ్చని .. ఆఫీస్‌లో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చొని పనిచేసుకోవాలని స్పష్టం చేసింది.

XGIMI ఆరా అల్ట్రా షార్ట్ త్రో 4కే ప్రొజెక్టర్ : ఈ ప్రొజెక్టర్ 3840 x 2160-పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 150 అంగుళాల స్క్రీన్ పరిమాణంపై 4K చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తుంది. దీనిలో ఎనిమిది పాయింట్ల కీస్టోన్ కరెక్షన్ టెక్నాలజీని ఉంది. గోడలు లేదా స్క్రీన్కు అనుకూలం అయ్యేలా నిలువుగా, అడ్డంగా సమలేఖనం చేస్తుంది. అలాగే దీనిలోని హార్మాన్ కార్డాన్ స్పీకర్లతో మంచి బేస్ తో కూడిన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. 150-అంగుళాల స్క్రీన్ ను కలిగిఉన్న ఈ ప్రొజెక్టర్ 2800 ల్యూమన్ల కాంతిని ప్రొజెక్ట్ చేస్తుంది. 80 నుంచి 150 అంగుళాల వరకు ప్రొజెక్షన్ పరిమాణాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4K UHD, స్పెక్కిల్ ఎలిమినేషన్ టెక్నాలజీతో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని ఆస్వాదించవచ్చు. వేగంగా కదిలే వస్తువులు సైతం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకోసం ఎంఈఎంసీ సాంకేతికత ఈ ప్రొజెక్టర్ లో ఇచ్చాు. తద్వారా ఇది క్రీడలను వీక్షించేందుకు మంచి ఆప్షన్. డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
BenQ V6000 4K లేజర్ టీవీ ప్రొజెక్టర్ : ఈ ప్రొజెక్టర్ 3000 ల్యూమెన్ల కాంతితో చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది 120-అంగుళాల పెద్ద స్క్రీన్ పరిమాణాన్ని అందిస్తుంది. 2,000,000:1 కాంట్రాస్ట్ రేషియో కూడా కలిగి ఉంది. 8.3 మిలియన్ విభిన్న పిక్సెల్‌లతో 4K UHD 3840×2160 రిజల్యూషన్ తో క్వాలిటీ పిక్చర్ ను అందిస్తుంది. ప్రొజెక్టర్ పైన ఆటోమేటిక్ సన్‌రూఫ్ స్లయిడర్ ఉంటుంది. ఇది ప్రొజెక్టర్ వినియోగంలో లేనప్పుడు దానిని సంరక్షిస్తుంది. ట్రెవోలో స్పీకర్లతో మంచి సౌండ్ క్వాలిటీ అందిస్తుంది.
Mi 4K లేజర్ ప్రొజెక్టర్ : 150 అంగుళాల స్క్రీన్ పరిమాణం కలిగిన ఎంఐ 4కే లేజర్ ప్రొజెక్టర్ 0.233:1 అల్ట్రా-త్రో నిష్పత్తిని కలిగి ఉంది. దీనికి అదనపు వైరింగ్ అవసరం లేదు. ప్రొజెక్టర్ 3000:1 కాంట్రాస్ట్ రేషియోతో పాటు1600 ల్యూమెన్ల కాంతితో చిత్రాన్ని ప్రోజెక్ట్ చేస్తుంది. ల్లో ఉపయోగించే లేజర్ లైట్ టెక్నాలజీని కలిగి ఉన్నందున మీరు థియేటర్ వీక్షణ అనుభవాన్ని పొందుతారు. డ్యూయల్ ఫుల్ రేంజ్, డ్యూయల్ హై-ఫ్రీక్వెన్సీ ఆడియో సిస్టమ్ కలయికతో హై-ఫై సౌండ్ సిస్టమ్ మంచి సౌండింగ్ ను అందిస్తుంది.
AAO YG650 4K ప్రొజెక్టర్ : ఇది గేమింగ్ కు అనువైన ప్రొజెక్టర్ 2.4G/5G కనెక్టివిటీతో రు ఆండ్రాయిడ్ లేదాఐఓఎస్ ఫోన్ ద్వారా కంటెంట్‌ను సజావుగా ప్రసారం చేయవచ్చు. 1920×1080 రిజల్యూషన్ తో 7000 ల్యూమన్ కాంతితో చిత్రాలను ప్రదర్శించగలుగుతుంది. స్క్రీన్ పరిమాణాన్ని 40 అంగుళాల నుంచి 300 అంగుళాల వరకు సర్దుబాటు చేయవచ్చు. ఇది 8000:1 నుండి 10,000:1 వరకు కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది. ఇది హైఫై స్టీరియో స్పీకర్‌ను కూడా కలిగి ఉంది.