మైక్రోసాఫ్ట్, గూగుల్ తమ ఏఐ-ఆధారిత టూల్స్‌ను ప్రకటించగా పరిశ్రమ మొత్తం ఏఐపై హాట్ డిబేట్ సాగిస్తోంది. ఒపెరా సైతం చాట్‌జీపీటీని జోడిస్తూ ఏఐ రేసులో ఎంటరైంది. తన వెబ్‌బ్రౌజర్లు, కంటెంట్ యాప్స్‌లో ఏఐని ఇంటిగ్రేట్ చేసేందుకు కసరత్తు సాగిస్తోంది. తన పీసీ, మొబైల్ బ్రౌజర్స్‌లో ఏఐ జనరేటెడ్ కంటెంట్ (ఏఐజీసీ)ను జోడించనున్నట్టు ఒపెరా ప్రకటించింది. బ్రౌజర్, న్యూస్, గేమింగ్ ఉత్పత్తుల కోసం ప్రస్తుత ఏఐ ప్రోగ్రాంను ఏఐజీసీకి విస్తరించేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. షార్టెన్ పేరుతో చాట్‌జీపీటీ టూల్‌ను తన బ్రౌజర్ సైడ్‌బార్‌లో న్యూ ఫీచర్‌గా యాడ్ చేయనున్నామని ఒపెరా వెల్లడించింది. షార్టెన్ టూల్‌ను వెబ్‌పేజీలు, ఆర్టికల్స్ సమ్మరీని జనరేట్ చేసేందుకు వాడవచ్చు. బ్రౌజర్‌లో చాట్‌జీపీటీని ఎలా ఇంటిగ్రేట్ చేస్తారనే దానిపై కంపెనీ బ్లాగ్‌లో షార్ట్ డెమో వీడియో అందుబాటులో ఉంది. బ్రౌజర్ ఇన్నోవేషన్‌లో గత పాతికేండ్లగా కంపెనీ ప్రస్ధానంలో తాము ముందువరసలో నిలిచామని ఏఐ పవర్డ్ వెబ్‌కు ముఖద్వారంగా తమ బ్రౌజర్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని జనరేటివ్ ఏఐ టూల్స్‌కు తమ యూజర్లకు యాక్సెస్ కల్పిస్తామని ఒపెరా కో-సీఈఓ సాంగ్ లిన్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా న్యూ ఫీచర్ ఇంకా యూజర్లందరికీ ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ లాంఛ్ చేయగా గూగుల్ బార్డ్ పేరుతో ఏఐ రేసులో ఎంటరైంది.
0 Comments