Posts

Showing posts with the label "Pay on delivery fee"

జొమాటో క్యాష్ ఆన్ డెలివరీకి అదనపు ఛార్జీ వసూలు !

Image
జొ మాటో ఆన్‌లైన్ చెల్లింపులు కాకుండా ఆర్డర్ డెలివరీ సమయంలో నగదు రూపంలో చెల్లించే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. క్యాష్‌ ఆన్‌ డెలివరీ (సీఓడీ) ఎంచుకునే వారిపై రూ.5 నుంచి రూ.20 వరకు ప్రత్యేక ఛార్జీని జొమాటో వసూలు చేయడం ప్రారంభించింది. జొమాటో యాప్‌లోని బిల్ సమ్మరీలో ఈ అదనపు మోత 'Pay on delivery fee' పేరుతో ప్రత్యక్షమవుతోంది. కొన్ని ప్రాంతాలు, యూజర్ల పరిమితిని బట్టి రూ. 7 లేదా రూ. 20 వరకు వసూలు చేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆన్‌లైన్ లేదా డిజిటల్ పద్ధతుల్లో ముందస్తుగా చెల్లించే యూజర్లకు ఈ అదనపు రుసుము వర్తించదు. ఇప్పటికే డెలివరీ చార్జీలు, ప్లాట్‌ఫామ్ ఫీజులు, రెస్టారెంట్ ప్యాకేజింగ్ చార్జీలు, జీఎస్‌టీతో సతమతమవుతున్న కస్టమర్లకు ఈ సీఓడీ ఫీజు మరింత అదనపు భారంగా మారింది. రోజుకు సగటున 23 లక్షల నుంచి 25 లక్షలకు పైగా ఆర్డర్లు ప్రాసెస్ చేసే జొమాటో, చెల్లింపుల విధానం నుండి కూడా ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.