Posts

Showing posts with the label Akhilesh Yadav

యూపీలో బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత 26 వేల ప్రభుత్వ పాఠశాల మూసేవేత !

Image
ఉ త్తరప్రదేశ్‌, లక్నోలోని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిలేష్‌ యాదవ్ మాట్లాడుతూ  బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 26 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలైన 'పీడీఏ' వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయడమే ఈ చర్య ఉద్దేశమని ఆయన విమర్శించారు.  అధికారిక గణాంకాల ప్రకారం బీజేపీ అధికారంలోకి వచ్చిన 2017 మార్చి నాటికి ఉత్తరప్రదేశ్‌లో 1,13,938 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉండేవని తెలిపారు. అయితే అప్పటి నుంచి 26,000కు పైగా పాఠశాలలు మూతపడ్డాయని ఆరోపించారు. అత్యధికంగా లఖింపూర్ ఖేరీలో 758, సీతాపూర్‌లో 650, ప్రయాగ్‌రాజ్‌లో 638, సీఎం ఆదిత్యనాథ్ సొంత జిల్లా అయిన గోరఖ్‌పూర్‌లో కూడా సుమారు 500 ప్రాథమిక స్కూళ్లను మూసివేసినట్లు అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు. వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలైన 'పీడీఏ' వర్గాల పిల్లలకు విద్యను దూరం చేయడమే ఈ చర్య ఉద్దేశమని ఆయన మండిపడ్డారు. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య 2017లో 1.17 కోట్లు ఉండగా, 2026 నాటికి ...

చట్టం సమర్థవంతంగా పనిచేసి ఉంటే బీజేపీ పదేళ్ల పాలనలో 20 పరీక్షల పేపర్లు ఎలా లీక్ అయ్యాయి?

Image
లో క్‌సభలో పేపర్ లీక్ వ్యతిరేక సవరణ బిల్లుపై జరుగుతున్న చర్చలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ దేశ రాజధానిలో విద్యార్థులు చేపట్టిన నిరసనలపై ప్రభుత్వం తలవంచుతుంది, కానీ దాన్ని తలవంచేలా చేసే వ్యక్తి కావాలి అని అన్నారు. చట్టం సమర్థవంతంగా పనిచేసి ఉంటే భాజపా పదేళ్ల పాలనలో 20 పరీక్షల పేపర్లు ఎలా లీక్ అయ్యాయి?" అని ప్రశ్నించారు. అలాగే "దొంగతనాన్ని అడ్డుకోవడంలో విఫలమైన వారిని ఎలా నమ్మగలం? ఈ కొత్త బిల్లు కేవలం ఉన్న చట్టానికి సవరణ మాత్రమే. మీరు ఎవరిని అమాయకులను చేయాలని చూస్తున్నారు? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు "ఎమర్జెన్సీ" కాలం గురించి మరియు నిరసనలను అణచివేసిన తీరు గురించి లేవనెత్తగా దానికి ఎస్పీ అధ్యక్షుడు స్పందిస్తూ నేను ఎమర్జెన్సీని చూడలేదు కానీ ఇక్కడే దేశ రాజధానిలో ఏం జరిగిందో ప్రత్యక్షంగా చూశాను. విద్యార్థుల ఆందోళనను అణచివేయడానికి ప్రభుత్వం టియర్ గ్యాస్ షెల్స్, మేకులున్న లాఠీలు మరియు ఇతర ఆయుధాలను ఉపయోగించింది అని ఆరోపించారు.