ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లాంగ్ వెర్షన్ !
ఇ న్‌స్టాగ్రామ్ లో ఇన్ స్టా రీల్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. వినియోగదారుల ఆసక్తి, వారి అవసరాలకు అనుగుణంగా కంపెనీ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈక్రమంలోనే మరో కొత్త ఫీచర్ ను ఇన్ స్టాగ్రామ్ పరీక్షిస్తోంది. అదేంటంటే మీరు ఏదైనా ఫీడ్ ను పోస్ట్ చేయాలనుకున్నప్పుడు కేవలం కొంత మంది ఫాలోవర్స్ లేదా క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే అది షేర్ చేసుకొనేలా ఈ ఫీచర్ ఉండబోతోంది. ప్రస్తుతం ఇన్ స్టాలో మీరు ఏదైనా పోస్టు పెడితే మీ వాల్ పై పోస్ట్ అవుతుంది. మీ ఫాలోవర్లు, ఫ్రెండ్స్ అందరూ చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇకపై కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ కు మాత్రమే షేర్ అయ్యేలా కొత్త ఫీచర్ ఉండనుంది. ఈ కొత్త ఫీచర్ కు సంబంధించిన వివరాలను సూచించే స్క్రీన్ షాట్ ను డిజిటల్ మీడియా మార్కెటింగ్ ఇన్ స్ట్రక్టర్ లియా హేబర్ మేన్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో అది కాస్త వైరల్ అయ్యింది. అలాగే మొబైల్ డెవలపర్ అలెశాండ్రో పలుజ్జీ మే 5వ తేదీనే ఈ కొత్త అప్ డేట్ కు సంబంధించి విషయాన్నిఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. అంతే గత కొంత కాలం నుంచే ఇన్ స్టా గ్రామ్ ఫీచర్ పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో దీనిపై మెటా ప్రతినిధి ఒకరు ...