Posts

Showing posts with the label 90 డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ల్యాండ్ దిగుతుందని

చంద్రుడిపై మట్టి, రాళ్లు తేవటమే లక్ష్యం !

Image
చం ద్రయాన్-3 ప్రయోగం సక్సెస్‌తో అంతరిక్ష రంగంలో అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరింది. ఇప్పుడు ఇస్రో ఇనుమడించిన ఉత్సాహంతో చంద్రయాన్ -4పై దృష్టి పెట్టింది. ఈ మిషన్ తో చంద్రుడినుంచి మట్టితో పాటు చిన్నపాటి రాళ్లను కూడా తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని కోసం ఇస్రో చంద్రయాన్ -4కు రంగం సిద్ధం చేస్తోంది. పూనెలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలనీ 62వ స్థాపక దినోత్సవం సందర్భంగా స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ చంద్రయాన్-4 గురించి అత్యంత ఆసక్తికర విషయాలను వెల్లడించటంతో ఇప్పుడంతా అదే ప్రాజెక్టు గురించే చర్చ నడుస్తోంది. చంద్రయాన్ -4 గురించి నీలేష్ దేశాయ్ చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చంద్రయాన్-3 విజయం తమకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని అదే ఉత్సాహంతో చంద్రయాన్-4తో చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి, చిన్నపాటి రాళ్లను తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టిన శివశక్తి పాయింట్ నుంచి మట్టి నమూనాలను తీసుకొచ్చే లక్ష్యంతో ఈ ప్రయోగం ఉండనుంది. ఐదు నుంచి ఏడు సంవత్సరాలలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నామని తెల...