లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5i విడుదల
జ ర్మనీ, యూకే, మలేషియా, ఆస్ట్రేలియాతో సహా పలు మార్కెట్లలో లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5i 120Hz ఐపీఎస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఇంటెల్ వైల్డ్‌క్యాట్ లేక్ ప్రాసెసర్, ఏఐ ఎన్‌పియుతో విడుదల చేసింది. ఈ కొత్త ల్యాప్‌టాప్ ఇంటెల్ కొత్త వైల్డ్‌క్యాట్ లేక్ ప్రాసెసర్‌లతో వస్తుంది. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5iలో 120Hz టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, 32GB వరకు ర్యామ్ కోపైలట్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5i ల్యాప్‌టాప్ గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ అయింది. ఈ డివైజ్ ధర ఆస్ట్రేలియాలో 1,499 డాలర్లు, ఫ్రాన్స్‌లో 1,229 యూరోలు, జర్మనీలో 1,099 యూరోలు, హాంగ్‌కాంగ్‌లో 7,850 హెచ్‌కే డాలర్లు, మలేషియాలో RM4,280.20, యూకేలో £970గా ఉంది. ఈ ల్యాప్‌టాప్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. బాడీ డిజైన్ అల్యూమినియం ఛాసిస్‌తో వస్తుంది. బరువు సుమారు 3.28 పౌండ్లు (దాదాపు 1.48 కిలోగ్రాములు) ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు ఇచ్చే 15.3-అంగుళాల ఐపీఎస్ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 1920×1200 పిక్సెల్స్ , 16:10 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ స్క్రీన్ 400 నిట్స్ బ్రైట్‌నె...