అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ. 20 లక్షలు పలుకుతున్న హిమాలయన్ వయాగ్రా
అం తర్జాతీయ మార్కెట్‌లో 'యార్సాగుంబా' అని పిలిచే హిమాలయ ప్రాంతంలో లభించే 'క్యాటర్‌పిల్లర్ ఫంగస్'కి విపరీతమైన డిమాండ్ వుంది. ప్రపంచ మార్కెట్‌లో దీని ధర కిలోకు సుమారు రూ. 20 లక్షల వరకు పలుకుతుండటంతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హిమాలయాల్లోని 4,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న మంచు ప్రదేశాలలో నివసించే ఒక రకమైన చిమ్మట యొక్క లార్వాలు (క్యాటర్‌పిల్లర్స్) భూమి అడుగున ఉన్న సమయంలో ఒక రకమైన శిలీంధ్రం (ఫంగస్) వాటి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ ఫంగస్ సదరు పురుగులోని జీవసారాన్ని మొత్తం పీల్చేసి, దాన్ని లోపలనే చంపేస్తుంది. ఆ తర్వాత వేసవి కాలంలో మంచు కరగడం ప్రారంభమయ్యాక, చనిపోయిన ఆ పురుగు తల భాగం నుండి ఒక చిన్న గడ్డి మొలక లాంటి ఫంగస్ భూమిపైకి వస్తుంది. తవ్వి తీస్తే కింద పురుగు, పైన ఫంగస్ కలిసిపోయి ఒకే ఆకారంలో కనిపిస్తాయి. ఈ అరుదైన జీవినే 'యార్సాగుంబా' అని పిలుస్తారు. చైనా సాంప్రదాయ వైద్యంలో ఈ జీవికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనికి అనేక రకాల అద్భుత వైద్య గుణాలు ఉన్నాయని నమ్ముతారు. ఇది శరీరానికి అమితమైన శక్తిని, రోగనిరోధక శక్తిని అందిస్తుంది. అంతర్జాతీయంగా దీనిని 'హిమాలయన్...