Posts

Showing posts with the label 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలు

ముదిరిన అమెరికా, చైనా వాణిజ్య వివాదం !

Image
అ మెరికా రక్షణ సంస్థలపై ఆంక్షలను తీవ్రతరం చేయడం ద్వారా చైనా యూఎస్‌కి సవాల్ విసిరింది. ఒక వారం వ్యవధిలోనే చైనా ఈరోజు 10 యూఎస్ కంపెనీలపై సెకండ్ రౌండ్ ఆంక్షలను ప్రకటించింది. తైవాన్‌కి ఆయుధాలు అమ్మడం వల్లే చైనా, యూఎస్ కంపెనీలపై జరిమానాలు, ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. చైనా మొత్తం 45 అమెరికా సంస్థలపై చర్యలు తీసుకుంది. 17 సంస్థలపై ఆంక్షలు విధించగా, 28 సంస్థల ఎగుమతి నిషేధ జాబితాలో చేర్చి జరిమానా విధించింది. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రక్షణ తయారీదారుగా ఉన్న బోయింగ్ డిఫెన్స్, లాక్‌హీడ్ మార్టిన్, రేథియాన్, జనరల్ డైనమిక్స్ వాటి అనుబంధ సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం… తైవాన్‌కి ఆయుధాలు అమ్మకంలో పాల్గొన్నందున మొత్తం 10 అమెరికన్ సంస్థలు అవిశ్వసనీయ సంస్థల జాబితాలో చేర్చబడ్డాయని పేర్కొంది. ఈ కంపెనీల నుంచి దేశంలోకి దిగుమతి, ఎగుమతులను నిషేధించబడ్డాయని పేర్కొంది. చైనాలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని అనుమతించబోమని చెప్పింది. ఆయా కంపెనీల సీనియర్ మేనేజ్మెంట్‌ని దేశంలోకి రాకుండా నిషేధిస్తామని తెలిపింది. తైవాన్, తమ ''వన్ చైనా'' విధానంలో భా...