Posts

Showing posts with the label Apple intends to release only its high-end 'Pro' models in September

ఐఫోన్ 18 సిరీస్ లో సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్న యాపిల్

Image
యా పిల్ రాబోయే ఐఫోన్ 18 సిరీస్ విషయంలో సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలోనే అన్ని మోడళ్లను ఒకేసారి విడుదల చేసే సంప్రదాయానికి యాపిల్ స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. యాపిల్ కేవలం తన హై-ఎండ్ ప్రో మోడళ్లను మాత్రమే ఎప్పటిలాగే సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి తీసుకురానుంది. అయితే, బేస్ లేదా స్టాండర్డ్ వేరియంట్లను మాత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ సరికొత్త వ్యూహం వెనుక మార్కెట్ డిమాండ్, ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్ దాగి ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. లీకైన వివరాల ప్రకారం, 2027 మొదటి సగభాగంలో రాబోయే స్టాండర్డ్ ఐఫోన్ 18, నాన్-ఫ్లాగ్‌షిప్ మోడల్ ఐఫోన్ 18ఈ స్మార్ట్‌ఫోన్లు ఏకంగా 9జీబీ డీరామ్  తో రాబోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడళ్లలోని 8జీబీ ర్యామ్‌తో పోలిస్తే ఇది ఒక మోస్తరు అప్‌గ్రేడ్ మాత్రమే. ఐఓఎస్ 27 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రాబోయే సరికొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను ఈ ఫోన్లు మరింత స్మూత్‌గా రన్ చేయడానికి యాపిల్ ఈ అదనపు మెమొరీని జత చేయబోతోంది. ఇందులో ఆరు 1.5జీబీ డీరామ్ డైస్ (1...