Posts

Showing posts with the label 'Axis My India' has projected that the TVK will win between 98 and 120 seats in the elections

తమిళనాడులో ప్రారంభమైన క్యాంపు రాజకీయాలు

Image
త మిళనాడులో ఎన్నికల ఫలితాలు హంగ్ వస్తుందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. పలు పార్టీలు తమ అభ్యర్థులను కాపాడుకునే ప్రయత్నాలను ప్రారంభించాయి. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే కీలక వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయ్ మహాబలిపురంలో ఓ రిసార్ట్ బుక్ చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకే అభ్యర్థులు నేరుగా ఆ రిసార్ట్‌కు రావాలని విజయ్ ఆదేశించినట్టు సమాచారం.  ఎన్నికల్లో టీవీకే 98-120 సీట్లు గెలుచుకుంటుందని 'యాక్సిస్ మై ఇండియా' అంచనా వేసింది. అలాగే, డీఎంకే నేతృత్వంలోని కూటమి 92-100 సీట్లు, ఏఐఏడీఎంకే నేతృత్వంలోని ఐదు పార్టీల కూటమి 22-32 సీట్లు దక్కించుకుంటాయని జోస్యం చెప్పింది. ఇక, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్.. డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డాయి. టీవీకే పది సీట్లు కూడా సాధించలేదని అంచనా వేశాయి.