About LATEST NEWS AP TO TG

Telugu computer tutorials Unicode to Anu conversion smartphone tips Telugu Use smartwatch tips Telugu EV news Telugu tech upd

Manual Description Here: Ea eam labores imperdiet, apeirian democritum ei nam, doming neglegentur ad vis.

3
Showing posts with label 12 seriously injured. Show all posts
Showing posts with label 12 seriously injured. Show all posts

ముంబయిలో స్కూల్ బస్సుపై కూలిన చెట్టు : విద్యార్థి మృతి, 12 మందికి తీవ్ర గాయాలు

ముంబయిలో గత రెండు రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెంబూరు ప్రాంతంలో ప్రయాణిస్తున్న ఒక పాఠశాల బస్సుపై మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వృక్షం కుప్పకూలింది. ‘యూనివర్సల్ హై స్కూల్’కు చెందిన మినీ బస్సు విద్యార్థులతో వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయానికి బస్సులో మొత్తం 15 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చెట్టు పడటంతో మినీ బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సు శిథిలాల మధ్య ఇరుక్కుపోయిన చిన్నారులను సిబ్బంది అతికష్టంపై బయటకు తీశారు. గాయపడిన విద్యార్థులందరినీ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి.

Read More...

హై టెన్షన్ విద్యుత్ వైర్లు తాకి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం : ముగ్గురు మృతి, 12మందికి తీవ్ర గాయాలు


రాజస్థాన్ లోని జైపూర్ - ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం  ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దమైంది. ఈ బస్సు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి తోడిలోని ఇటుక బట్టీకి కార్మికులను తీసుకెళ్తోంది. జైపూర్ గ్రామీణ జిల్లా షాపురా సబ్ డివిజన్ లోని మనోహర్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం వద్దకు రాగానే బస్సుకు హై టెన్షన్ విద్యుత్ వైర్లు తాకాయి. దీంతో భారీ శబ్దాలతోపాటు బస్సుకు మంటలు వ్యాపించాయి. మంటలు ఒక్కసారిగా బస్సు మొత్తం వ్యాపించడంతో బస్సు దగ్దమైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, 12మందికి గాయాలయ్యాయి. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Read More...