3

సిద్దిపేట కాంగ్రెస్‌ నుంచి 18 మంది నేతల సస్పెన్షన్

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత క్రమశిక్షణను బలోపేతం చేసే దిశగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్ష రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నిర్వహిస్తున్న అధికారిక సమావేశాలకు, కార్యక్రమాలకు వరుసగా గైర్హాజరవుతున్న 18 మంది నేతలను పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ వ్యవహారాల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన సంకేతాలను ఈ నిర్ణయం ద్వారా పార్టీ నాయకత్వం పంపింది. సస్పెన్షన్‌కు గురైన ఈ 18 మంది నేతలు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా, సరైన కారణాలు తెలపకుండా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని డీసీసీ అధ్యక్షురాలు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం కీలక సమావేశాలు నిర్వహిస్తున్న సమయంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి కూడా గైర్హాజరు కావడాన్ని జిల్లా నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయంపై వివరణ కోరుతూ ఈ నెల 9వ తేదీన సదరు 18 మంది నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లోగా తమ గైర్హాజరుకు గల కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని డీసీసీ ఆదేశించినప్పటికీ, ఆ నేతలు ఎవరూ స్పందించలేదు. నోటీసుల గడువు ముగిసిన తర్వాత కూడా కనీస వివరణ ఇవ్వకపోవడాన్ని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించిన ఆంక్ష రెడ్డి, వారిని తక్షణమే పార్టీ పదవుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Related Post

Previous
Next Post »