రిలయన్స్ జియో 'హ్యాపీ న్యూ ఇయర్ 2.0' పేరుతో సరికొత్త రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో అన్‌లిమిటెడ్ 4G, 5G డేటాతో పాటు ఏడాది వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లు, తక్కువ ధరలో అదనపు డేటా ప్యాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా రూ.399 నెలవారీ ప్లాన్, రూ.3,999 వార్షిక ప్లాన్ వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి. రూ.399 ప్లాన్‌లో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా సదుపాయం లభిస్తుంది. దీనితోపాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అందిస్తారు. కేవలం మొబైల్ సేవలకే పరిమితం కాకుండా పలు డిజిటల్ ప్రయోజనాలను కూడా ఉచితంగా జతచేశారు. ఇందులో రూ.4,000 విలువైన 12 నెలల కాన్వ ప్రో సభ్యత్వం ప్రధాన ఆకర్షణగా ఉంది. అలాగే JioHotstar Mobile, JioTV ద్వారా హాలీవుడ్ కంటెంట్, FanCode సభ్యత్వం, JioGames మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంటాయి. JioAICloud ద్వారా 50GB క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు JustDial Lite, స్థానిక ప్రత్యేక కూపన్లు, Digital Diary సేవలను కూడా పొందవచ్చు. ఎక్కువ కాలం ఒకే రీఛార్జ్‌తో కొనసాగాలనుకునే వారి కోసం రూ.3,999 వార్షిక ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్‌తో 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా, అపరిమిత కాల్స్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అదనంగా రూ.1,590 విలువైన 12 నెలల Canva Pro Lite సభ్యత్వం, JioHotstar Mobile, హాలీవుడ్ కంటెంట్, JioTV ద్వారా FanCode, 50GB JioAICloud స్టోరేజ్ అందిస్తారు. తక్కువ వ్యవధికి ఎక్కువ డేటా అవసరమయ్యే వారి కోసం రూ.15, రూ.25 ధరల్లో రెండు ప్రత్యేక 5G యాడ్ ఆన్ ప్యాక్‌లను తీసుకొచ్చింది. వీటికి వరుసగా ఒక రోజు, రెండు రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. మరోవైపు రూ.50తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన అన్‌లిమిటెడ్ నైట్ డేటా ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ప్రతిరోజూ అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా ఉపయోగించుకోవచ్చు. ఈ డేటా సాధారణ రోజువారీ పరిమితికి అదనంగా ఉంటుంది. విద్యార్థులు, రాత్రి విధులు నిర్వహించేవారు, గేమర్లు, సినిమాలు చూసేవారికి ఇది ఉపయోగపడనుంది. అయితే అన్ని ప్రయోజనాలు, అర్హతలు జియో నిబంధనలకు లోబడి ఉంటాయి.
3
Beranda
› 999 annual plan are particularly attractive to users
› business
› Jio Launches New Recharge Plans Under 'Happy New Year 2.0'
› Rs 399 monthly plan and the Rs 3
› technology
› జియో 'హ్యాపీ న్యూ ఇయర్ 2.0' పేరుతో సరికొత్త రీఛార్జ్ ప్లాన్లు
Subscribe to:
Post Comments (Atom)
