జార్ఖండ్‌లోని చత్రా జిల్లా తాండ్వాలో ఉన్న ఎన్టీపీసీ నార్త్ కరణ్‌పురా సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న కన్వేయర్ బెల్ట్ పనులు జరుగుతుండగా జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చత్రా పోలీస్ సూపరింటెండెంట్ అనిమేష్ నైతాని తెలిపిన వివరాల ప్రకారం, తాండ్వాలోని ఎన్టీపీసీ ప్లాంట్‌లో ఔట్‌సోర్సింగ్ సంస్థ ఆధ్వర్యంలో కన్వేయర్ బెల్ట్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదం జరగడంతో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు సింప్లెక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ మరియు థైసెన్‌క్రుప్ సంస్థలకు చెందిన కార్మికులని ఎన్టీపీసీ ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఈ దురదృష్టకర ఘటనపై ఎన్టీపీసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపింది. గాయపడిన ఇద్దరు కార్మికులకు మెరుగైన వైద్యం అందుతోందని, ప్రమాదానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. కార్మికుల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఈ ప్రమాదంపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 'ఎక్స్' వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎన్టీపీసీ ప్రమాదంలో కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులకు జిల్లా యంత్రాంగం ద్వారా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
3
Beranda
› Accident at NTPC Plant During Conveyor Belt Construction
› Chatra district
› Jharkhand
› Tandwa
› Three Workers Killed
› Two Others Seriously Injured
› ఎన్టీపీసీ ప్లాంట్‌లో కన్వేయర్ బెల్ట్ జరుగుతుండగా ప్రమాదం : ముగ్గురు కార్మికుల దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
Subscribe to:
Post Comments (Atom)
