ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందిన మూడు అత్యంత కీలకమైన టెక్నాలజీ పాలసీలకు సంబంధించి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ పాలసీ , ఏపీ రొబోటిక్స్ , ఫిజికల్ ఏఐ పాలసీ , అలాగే సవరించిన సెమీకండక్టర్ , డిస్‌ప్లే ఫ్యాబ్ పాలసీలకు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. యానిమేషన్, గేమింగ్ రంగాల్లో ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేందుకు అమరావతిలో 200 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక AVGC-XR పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నూతన AVGC-XR పాలసీ ద్వారా స్టూడియోలు, గేమింగ్ డెవలపర్‌లు, స్టార్టప్‌లకు ప్రత్యేక రాయితీలు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. తద్వారా రాష్ట్రంలోని సృజనాత్మక యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, అమరావతి డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా ఎదగనుంది. ఆటోమేషన్ , కృత్రిమ మేధస్సు రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రూపొందించిన రొబోటిక్స్, ఫిజికల్ ఏఐ పాలసీ కింద రొబోటిక్స్ తయారీ, పరిశోధన ,అభివృద్ధి కేంద్రాలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. పారిశ్రామిక, వైద్య, వ్యవసాయ రంగాల్లో వినియోగించే రోబోల తయారీ సంస్థలకు మూలధన రాయితీలు, పరీక్షా కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందించనుంది. అదేవిధంగా, దేశీయ చిప్ తయారీ రంగంలో కీలక భాగస్వామిగా మారేందుకు సవరించిన సెమీకండక్టర్ పాలసీకి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలో భారీ సెమీకండక్టర్ పార్క్ ఏర్పాటు కోసం ఏకంగా 5,000 ఎకరాల భూమిని కేటాయించింది. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాలో దక్షిణ భారతదేశపు తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ కేంద్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మూడు నూతన పాలసీల ఉత్తర్వులు రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక ప్రగతిలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికాయి.
3
Beranda
› Communications has issuedAndhra Pradesh
› electronics
› Official Orders Issued for Three Technology Policies
› tate Department of IT
› technology
› మూడు టెక్నాలజీ పాలసీలకు అధికారిక ఉత్తర్వులు జారీ
Subscribe to:
Post Comments (Atom)
