3

రాష్ట్ర పండుగగా రామోజీరావు జయంతి : సీఎం చంద్రబాబు ప్రకటన

ఈనాడు గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు జయంతిని ఏపీ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇకపై ప్రతి ఏటా నవంబర్ 16న అధికారికంగా రామోజీరావు జయంతిని నిర్వహించనున్నట్లుగా ఆయన వెల్లడించారు. మీడియా రంగానికి, సమాజ సేవకు ఆయన అందించిన అసమాన సేవలను ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా స్మరించుకున్నారు. తెలుగు పత్రికా రంగానికి ఒక నూతన ఒరవడిని దిద్దిన దార్శనికుడిగా, టెలివిజన్, సినీ రంగాలలో తనదైన చెరగని ముద్ర వేసిన మహనీయుడిగా రామోజీరావు సేవలను సీఎం చంద్రబాబు కొనియాడారు. అపజయం ఎరుగని తెలుగు వెలుగుగా, అసాధారణ పట్టుదల, క్రమశిక్షణతో వ్యవస్థలకు ధైర్యాన్ని అందించిన గొప్ప వ్యక్తిత్వం ఆయనదని గుర్తుచేశారు. రామోజీరావు పేరుతో ప్రత్యేకంగా అవార్డులు ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. చివరి శ్వాస వరకు ప్రజాశ్రేయస్సు, సమాజహితం కోసమే పరితపించిన రామోజీరావు జీవితం భావితరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని సీఎం తెలిపారు. ఈ అధికారిక వేడుకల ద్వారా ఆయన ఆశయాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.

Related Post

Previous
Next Post »