దక్షిణాఫ్రికాలో ఒకే రోజు రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో కనీసం 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పాతకక్షల నేపథ్యంలో ఇవి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పీటర్‌మారిట్జ్‌బర్గ్ నగర శివారులోని స్వీట్‌వాటర్స్ ప్రాంతంలో బుల్లెట్లతో దెబ్బతిన్న ఓ వాహనంలో 8 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. వీరు ఎవరనేది తెలియాల్సి ఉంది. అదేవిధంగా, రాజధాని ప్రిటోరియా సమీపంలోని జెఫ్స్‌విల్లేలోని అనధికార కాలనీలోని ఓ ఇంట్లో ఆదివారం 9 మంది బుల్లెట్ గాయాలతో విగతజీవులై కనిపించారు. వీరిలో ఆరుగురు పురుషులు కాగా, ముగ్గురు మహిళలు. కాల్పులు ఆదివారం రాత్రి 10, 11 గంటల మధ్యలోనే జరిగి ఉంటాయని పోలీసులు సోమవారం ఉదయం తెలిపారు. గత ఏడాది సౌల్స్‌విల్లేలో జరిగిన కాల్పుల ఘటనతో జెఫ్స్‌విల్లే ఘటనకు సంబంధం ఉండి ఉంటుందన్నారు. అప్పటి ఘటన నిందితుల్లో ఒకరు మృతుల్లో ఉన్నారని వివరించారు. సౌల్స్‌విల్లేలో గత ఏడాది జరిగిన కాల్పుల్లో 12 మంది చనిపోగా, 13 మంది గాయపడ్డారు. ఇది ప్రతీకార దాడి కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా, పీటర్‌మారిట్జ్‌బర్గ్ కాల్పుల ఘటనలో చనిపోయిన వారిని స్థానికులు గుర్తించారని, అయితే తాము ధ్రువీకరించుకోవాల్సి ఉందన్నారు. ఆ తర్వాతే ఈ దారుణానికి కారణాలను తెలపగలమని ఆ ప్రాంత పోలీసు ప్రతినిధి నెట్íÙయుందా పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఇటీవల సామూహిక కాల్పుల ఘటనలు వరుసగా నమోదవుతున్నాయి. సెపె్టంబర్‌లో తీర ప్రాంత డర్బన్ నగర శివారులోని ఓ ఇంట్లో విందు జరుగుతుండగా గుర్తు తెలియని ముగ్గురు సాయుధులు కాల్పులు జరిపి, గర్భిణీ సహా 11 మందిని బలి తీసుకున్నారు. అదే నెలలో ఓ బార్‌లోకి ఏకే-47 రైఫిల్స్ ధరించిన దుండగులు ప్రవేశించి 17 మందిని చంపారు. జూన్‌లో జొహన్నెస్‌బర్గ్‌లోనే నేరగాళ్ల ముఠాలు వేర్వేరు చోట్ల కాల్పులకు తెగబడి 12 మందిని కాల్చి చంపారు. జూన్‌లో జొహన్నెస్‌బర్గ్ శివారులో సాయుధ ముఠా ఓ కాలనీలో 12 మందిని కాల్చి చంపి, మరో 9 మందిని తీవ్రంగా గాయపర్చింది. మైనింగ్ ముఠాల మధ్య విభేదాలే ఘటనకు కారణమని పోలీసులు తేల్చారు.
3
Beranda
› 17 Killed in Two Separate Shooting Incidents in South Africa
› international
› Police Suspect Rivalry Between Mining Gangs
› దక్షిణాఫ్రికాలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో 17 మంది దుర్మరణం : మైనింగ్ ముఠాల మధ్య విభేదాలే ఘటనకు కారణమన్న పోలీసులు
Subscribe to:
Post Comments (Atom)
