3

ప్రధాని మోడీ కర్ణాటక పర్యటన : బెంగళూరు- గోవా వందేభారత్, మెట్రో పింక్ లైన్, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం

ప్రధాని మోడీ బెంగళూరులోని ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు రూ.15,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం మైసూరులో ప్రతిష్టాత్మక 'కాస్మోస్-మైసూరు ప్లానిటోరియం' ను ప్రధాని ప్రారంభించనున్నారు. అదే విధంగా బెంగళూరు (యశ్వంత్‌పూర్)- మడ్‌గావ్ (గోవా) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్నారు. యశ్వంత్‌పూర్ - మడ్‌గావ్ (26655): ఉదయం 7:35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి రాత్రి 8:55 గంటలకు మడ్‌గావ్ చేరుకుంటుంది. ఈ ప్రయాణానికి 13 గంటల 20 నిమిషాల సమయం పడుతుంది. (బుధవారం మినహా వారంలో 6 రోజులు నడుస్తుంది). అదే విధంగా మడ్‌గావ్ - యశ్వంత్‌పూర్ (26656): ఉదయం 8:20 గంటలకు మడ్‌గావ్‌లో బయలుదేరి రాత్రి 9:15 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ ప్రయాణానికి 12 గంటల 55 నిమిషాలు పడుతుంది. అదే విధంగా బెంగళూరులోని ప్రశాంతి కుటీరం స్వర్ణోత్సవాల్లో ప్రధాని పాల్గొంటారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12:45 గంటలకు తవరెకెరె నుండి ఐఐఎం బెంగళూరు వరకు బెంగళూరు మెట్రో పింక్ లైన్‌ను (కలేన అగ్రహార నుండి తవరెకెరె వరకు సుమారు రూ. 3,470 కోట్ల వ్యయంతో నిర్మించినది) జెండా ఊపి ప్రారంభించి, మెట్రోలో ప్రయాణిస్తారు. బెంగళూరులో రూ. 15,600 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు రూ. 4,450 కోట్ల పెట్టుబడితో అభివృద్ధి చేసిన, కొప్పల్-II మరియు గడగ్-II వద్ద పునరుత్పాదక ఇంధన జోన్‌ల ఏకీకరణ కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌మిషన్ స్కీమ్ (ఫేజ్-2)ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద పునర్‌ అభివృద్ధి చేసిన నాలుగు రైల్వే స్టేషన్‌లను - చామరాజనగర్‌, చిక్కమగళూరు, సకలేష్‌పూర్‌ మరియు సుబ్రహ్మణ్య రోడ్‌లను ప్రధాని ప్రారంభిస్తారు.

Related Post

Previous
Next Post »