3

విదేశాల్లో విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకుంటే బహుభార్యత్వం కింద క్రిమినల్ విచారణ ఎదుర్కోవాలి !

దేశంలో జరిగిన వివాహానికి సంబంధించి, విదేశాల్లోని సరళమైన చట్టాలను ఆసరాగా చేసుకుని పొందే విడాకులకు భారత చట్టాల ప్రకారం ఆటోమేటిక్‌గా చెల్లుబాటు ఉండదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారత చట్టాలు గుర్తించని కారణాలతో విదేశీ కోర్టుల నుంచి విడాకులు పొంది, ఆపై రెండో పెళ్లి చేసుకుంటే 'బహుభార్యత్వం' కింద క్రిమినల్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. భార్య వ్యతిరేకిస్తున్నప్పటికీ, 'వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమైంది' అనే కారణంతో విదేశీ కోర్టు నుంచి విడాకులు పొంది రెండో వివాహం చేసుకున్న ఓ వ్యక్తిపై బహుభార్యాత్వం (ఐపీసీ సెక్షన్ 494) కింద క్రిమినల్ చర్యలకు సుప్రీంకోర్టు అనుమతించింది. అయితే, ఆ వ్యక్తి తల్లిదండ్రులు, రెండో భార్యపై నమోదైన క్రిమినల్ కేసులను మాత్రం ధర్మాసనం కొట్టివేసింది.

Related Post

Previous
Next Post »