3

రేపు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ మూరత్ ట్రేడింగ్ సెషన్‌

రేపు దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ దీపావళి లక్ష్మీ పూజ సందర్భంగా గంటపాటు ప్రత్యేక మూరత్‌ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. సాధారణంగా ఏటా లక్ష్మీ పూజ సమయాన సాయంత్రం వేళ ఈ గంట సేపటి ప్రత్యేక సెషన్‌ను నిర్వహిస్తుంటారు. దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే మూరత్‌ ట్రేడింగ్ రోజున మార్కెట్లు సూచీలు లాభాల్లోనే ముగిసేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అయితే ఇది కేవలం ప్రతీకాత్మకమైనది కాబట్టి, మదుపర్లు దీర్ఘ కాలానికి మంచి రాబడులు ఇచ్చే బలమైన ఫండమెంటల్స్ ఉన్న క్వాలిటీ షేర్లలో పెట్టుబడి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టేవారికి ఈ రోజు శుభారంభం అని చెప్పవచ్చు.

Related Post

Previous
Next Post »