3

అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టును ఛేదించిన తెలంగాణ ఈగల్ ఫోర్స్

అస్సాంకు చెందిన భాస్కర్ హజారికా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి రవాణా ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఛేదించింది. సుమారు 60 రోజుల పాటు కొనసాగిన వేట అనంతరం ప్రధాన నిందితుడు భాస్కర్ హజారికాతో పాటు మొత్తం ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈగల్ ఫోర్స్, చౌటుప్పల్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో 24.7 కిలోల గంజాయి, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.2026 ఆగస్టు 27న చౌటుప్పల్ పరిధిలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారులో తరలిస్తున్న 20.36 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఒడిశాకు చెందిన త్రిలోచన్ సమంతరాయ్, సాగర్‌బల్లను అరెస్ట్ చేశారు. విచారణలో బికాస్ బారిక్, అస్సాంకు చెందిన భాస్కర్ హజారికా పేర్లు బయటపడ్డాయి. అనంతరం బికాస్ బారిక్‌ను కూడా అరెస్ట్ చేయగా, అతడి సమాచారం ఆధారంగా భాస్కర్ హజారికాపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భాస్కర్ హజారికాపై 2024లో మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో రెండు, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఒక గంజాయి కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసుల్లో బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం తిరిగి గంజాయి వ్యాపారాన్ని కొనసాగించినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఒడిశాకు చెందిన సరఫరాదారుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కిలో గంజాయితో సుమారు 150 చిన్న ప్యాకెట్లు తయారుచేసి ఒక్కో ప్యాకెట్‌ను రూ. 300 విక్రయిస్తున్నట్టు గుర్తించారు ఈగల్ ఫోర్స్ అధికారులు. సెక్యూరిటీ గార్డ్ ముసుగులో గంజాయి విక్రయాలు జరిపి, కోట్లు సొమ్ము చేసుకున్న భాస్కర్ హజారికా నెట్‌వర్క్‌పై సమగ్ర ఈగల్ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

Related Post

Latest
Previous
Next Post »